Telugu News

యువకుడిని నరికి చంపిన గుర్తుతెలియని వ్యక్తులు.

కన్నాయిగూడెం విజయం న్యూస్

0

యువకుడిని నరికి చంపిన గుర్తుతెలియని వ్యక్తులు.

(కన్నాయిగూడెం విజయం న్యూస్ )

ములుగు జిల్లా కన్నాయిగూడెం, మండలంలోని చింతగూడెం పంచాయతీ పరిధిలో స్మషాణవాటిక బిల్డింగ్ ఆవరణలో మంగళవారం రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గజ్జెల రామారావు (22) అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపేశారు స్థానిక గొత్తిగోయగూడెంలో రామారావు తల్లిదండ్రులు కిరాణం షాపు నడిపిస్తున్నారు, ఆ కిరాణం షాపులో రామారావు రోజువారీగా నిత్యావసర సరుకులు అమ్మీ రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చేవాడు అని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి,

ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, కన్నాయిగూడెం, ఎస్ఐ, చరణ్ కుమార్, సిబ్బంది తో సంఘటన స్థలానికి చేరుకుని చుట్టూ ప్రక్క పరిశరాలను చున్నంగా పరిశీలించి వివరాలు సేకరించగా, కాగా ఏటూరునాగారం, ఏఎస్పీ, అశోక్ కుమార్, సంఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు, ఈ సందర్భంగా ఏటూరునాగారం సీఐ కిరణ్ కుమార్ మాట్లాడుతూ హత్యా చేసిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు,

also read :-అలుగునూర్ కరీంనగర్ మానేరు బ్రిడ్జి పై నుండి క్రింద పడి వ్యక్తి మృతి…