Telugu News

వృద్ధులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన యువకులు

0

వృద్ధులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన యువకులు

(పినపాక/అశ్వాపురం-విజయంన్యూస్)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం మండలంలోని అరిఫా రోష్ని పండ్లు, నిత్యావసర సరుకులు అందచేశారు..ఈ సందర్భంగా సంస్థ సభ్యుడు బాజి  మాట్లాడుతూ సేవ చేయడమే లక్ష్యంగా ప్రారంభించబడిన భరోసా సంస్థ సారథ్యంలో అనేక రకాల సేవా కార్యక్రమాలతో పాటు, ఎంతోమందికి రక్తదానం చేయడం జరుగుతుంది.

 ఇది కూడా చదవండి:- ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా  ‘షర్మిళ’

అందులో భాగంగా అశ్వాపురం మండలంలో కూడా భరోసా సంస్థ ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి అవకాశం వచ్చినందుకు అదృష్టంగా భావిస్తున్నాం.రాబోయే రోజుల్లో కూడా మండల వ్యాప్తంగా ఎటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి అయినా మేము సిద్ధంగా ఉంటామన్నారు.ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు జోగు రాజు, ఖదీర్, శ్రీను, సవలం అనిల్, మనోజ్, రాంప్రసాద్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.