Telugu News

పాలేరుకు మీరే పోటీ చేయాలని కోరిన యువకులు

సానుకూలంగా స్పందించిన ఆ నాయకుడు

0

పాలేరుకు మీరే పోటీ చేయాలని కోరిన యువకులు

== సానుకూలంగా స్పందించిన ఆ నాయకుడు

(కూసుమంచి-విజయంన్యూస్)

పాలేరు నియోజకవర్గంలో మీరు పోటీ చేయాలని, తద్వారా పాలేరు నియోజకవర్గం మరింతగా అభివద్ది చెందుతుందని, అందుకే మీరు పోటీ చేస్తే మేమంతా యువకులమంతా కలిసి మీ కోసం పనిచేస్తామని యువకులు కోరారు. అసెంబ్లీలో మీలాంటి మేథావుల ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల ప్రశ్నించేవారే కరువైయ్యారని కోరారు పాలేరు నియోజకవర్గం అభివద్ది చెందాలంటే మిమ్మల్ని గెలిపించుకోవడం చాలా అవసరమని పలువురు ఆ నాయుడ్ని కోరారు.  పూర్తి వివరాల్లోకి వెళ్తే

ఇది కూడా చదవండి: ‘పాలేరు’లో ముదురుతున్న దోస్తుల లొల్లి

ఖమ్మం జిల్లా, పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం గ్రామానికి చెందిన కొంత మంది యువకులు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను తన నివాసంలో కలిశారు. సుమారు 20 మంది యువకులు తమ్మినేనితో బేటి అయ్యారు. ఎన్నికల్లో మీరు పోటీ చేయాలి చట్టసభల్లో కమ్యూనిస్టులు లేని లోటు ఇవ్వాళ రైతాంగం కానివ్వండి కార్మికులు గాని ఉద్యోగస్తులు గాని వారి సమస్యలను చట్టసభలోకి తీసుకెళ్లే వారు లేక చాలా నష్టం జరుగుతున్నది అందువల్ల మా గువ్వల గూడెం గ్రామం నుండి స్వచ్ఛందంగా యువకులం సిపిఎం పార్టీలో చేరడం జరిగింది. స్వచ్ఛందంగా తమ్మినేని ఇంటికి వచ్చి పార్టీలో చేరిన యువకులకు నేలకొండపల్లి మండల కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేశారు.