Telugu News

ఖమ్మంలో యువజన కాంగ్రెస్ నూతన సంవత్సర వేడుకలు..

== కేక్ కట్ చేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

0

ఖమ్మంలో యువజన కాంగ్రెస్ నూతన సంవత్సర వేడుకలు
== కేక్ కట్ చేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

(ఖమ్మం – విజయం న్యూస్)

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క క్యాంప్ కార్యాలయంలో ఆదివారం జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, మాజీ ఎంఎల్ సీ పోట్ల నాగేశ్వరరావు, స్థానిక సంస్థల ఎంఎల్ సీ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పూవ్వాళ్ళ దుర్గా ప్రసాద్ సమక్షంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు యడ్లపల్లి సంతోష్ కేక్ కట్ చేశారు.

మొదటి కేక్ భట్టి విక్రమార్కకు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రైతులు పంటలు మంచిగా పండి,పండిన పంటకు గిట్టుబాటు ధర పలకాలని కోరుకుంటున్నాను అన్నారు.

ఈ కార్యక్రమంలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు యం.డి. జావిద్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య , బీసీ సెల్l జిల్లా అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, కిసాన్ కేత్ జిల్లా అధ్యక్షులు మొక్క శేఖర్ ,సిటి కాంగ్రెస్ నాయకులు రవి తదితరులు పాల్గొన్నారు.

 

also read :- రేప‌టి నుంచి విద్యాసంస్థ‌లు, షాపులు అన్నీ బంద్‌..! ||

also read :-రేప‌టి నుంచి 15-18 ఏండ్ల‌ పిల్ల‌ల‌కు వ్యాక్సినేష‌న్ షురూ…