యువత దేశానికి వెన్నుముక : ఎమ్మెల్యే కందాళ
== చదువుకు కులాలు అడ్డు కావోద్దు
== మీకు అండగా ఉంటానని హామినిచ్చిన ఎమ్మెల్యే
== మాకు అండగా ఉండేవారికే మా మద్దతు అంటున్న యువత
(కూసుమంచి-విజయంన్యూస్)
దేశానికి యువతే వెన్నుముక అని, యువతతోనే ఏదైనా సాధించగలమని, అలాంటి యువతను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి స్పష్టం చేశారు. కూసుమంచి మండలం నేలపట్ల గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీ వాసులు పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డిని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు.
ఇది కూడా చదవండి:- కందాళ సేవకు సలామ్
యువకుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యువతను పట్టించుకునే వారే లేరని, యువత సమస్యలను పరిష్కరించాలని కోరారు. గ్రామంలో సమస్యలను పరిష్కరించాలని కోరారు. దీంతో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ యువత సమస్యలను కచ్చితంగా పరిష్కరిస్తానని, గ్రామంలో సమస్యలను పరిష్కరిస్తానని హామినిచ్చారు. ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం పనిచేసేవారిని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. దీంతో యువకులు మాట్లాడుతూ పనిచేసేవారికే మా పూర్తి స్థాయి మద్దతు ఉంటుందని తెలియజేశారు.
ఇది కూడా చదవండి:- పార్టీని నడపలేని దద్దమ్మ రాహుల్ గాంధీ: మంత్రి
పనితనం,దానగుణం నచ్చి పార్టీలకు అతీతంగా మేము మీతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము అని ఎమ్మెల్యే కందాళ కి తెలియజేశారు.
== నా ఆశయం,నా కోరిక ప్రజల కోసం పనిచేయడమే : ఎమ్మెల్యే కందాళ..
ఖమ్మం రూరల్ మండలం ఎం.వెంకటాయపాలేం గ్రామంలో ఏర్పాటు చేసిన పద్మ శాలి సంఘం ఆత్మీయ సమ్మేళనంకు ముఖ్య అతిథిగా హాజరైన పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలక్షన్ అనంతరం ఎం.వెంకటాయపాలేం ను మండలం చెపిస్తా,దానితో పాటుగా సకల వసతులతో మోడల్ మండలంగా తీర్చిదిద్దుతా అని హామీ ఇస్తున్నాను.
ఇది కూడా చదవండి:- లోక్ సభ అభ్యర్థిగా ‘షర్మిళ’..ఎక్కడ నుంచంటే..?