Telugu News

రాజీవ్ గాంధీ ఆన్లైన్ క్విజ్ పోటీలలో యువత పాల్గొనండి: మాదవిరెడ్డి

విస్త్రతంగా ప్రచారం నిర్వహిస్తున్న రామసహాయం మాధవిరెడ్డి

0

రాజీవ్ గాంధీ ఆన్లైన్ క్విజ్ కంపిటేషన్ లో యువత పాల్గొనండి

== విస్త్రతంగా ప్రచారం నిర్వహిస్తున్న రామసహాయం మాధవిరెడ్డి

(నేలకొండపల్లి-విజయంన్యూస్)

కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆదేశాలతో టీపీసీసీ అత్యంత ప్రతిష్టాత్మకం గా తీసుకున్న రాజీవ్ గాంధీ ఆన్లైన్ క్విజ్ కంపిటేషన్ పైన రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు రామసహాయం మాధవి రెడ్డి పాలేరు నియోజకవర్గం వ్యాపితం గా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా నేలకొండపల్లి మండలం బోధలబండ గ్రామంలో గ్రామ ముఖ్య నాయకులకు డెమో ఇచ్చి గ్రామానికి చెందిన యువకులను, విద్యార్థులను అత్యధికం గా నమోదు చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమం లో గ్రామ నాయకులు నెల్లూరి వెంకటేశ్వర రావు, రాయపాటి శ్రీనివాస్, నెల్లూరి నాగేశ్వరావు, కాకాని సీతారాం, కూసుమంచి మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బండారుపల్లి శ్రీనివాసరావు, కూసుమంచి మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బండారుపల్లి శ్రీనివాస రావు, అద్దంకి కోటయ్య చారి తదితరులు పాల్గొన్నారు

ఇది కూడా చదవండి: షర్మిళ..విలీనామా..? విహారమా..?