Telugu News

వైఎస్ షర్మిళ దారేటు..? నేతల రూటేటు..?

దేశరాజదానిలోనే మకాం.. మంకుపట్టు వీడని షర్మిళ

0

వైఎస్ షర్మిళ దారేటు..? నేతల రూటేటు..?

== విలీనామా..? విహారమా..?

== ఎమ్మెల్యేకా..? ఎంపీకా..?

== అధిష్టానంతో అధినేత్రి  చర్చలు

== దేశరాజదానిలోనే మకాం.. మంకుపట్టు వీడని షర్మిళ

== ఆ సీటుకైతే తిరుగేలేదంటున్న జిల్లా ప్రజలు

 

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

రాష్ట్ర రాజకీయాల్లోనే లేడి టైగర్ గా, ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన వైఎస్ షర్మిళ  అతిచిన్నవయస్సులోనే రాజకీయ పార్టీ స్థాపించి అధికార పార్టీలకు ముచ్చెమటలను పట్టించారు. ప్రజల గుండె చప్పుడు గా పేరుగాంచిన స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలు వైఎస్ షర్మిళ రాజన్న రాజ్యం పేరుతో నూతన పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్లారు. అనితకాలంలోనే ప్రజాధారణ పొందిన రాజకీయ నాయకురాలిగా గుర్తింపు పొందారు.. అధికారమే లక్ష్యంగా ముందుకు సాగిన ఆమె, అధికార పార్టీలు, ప్రతిపక్షాలపై నిప్పులు చేరిగారు. రాజన్న రాజ్యంలో పాలన ఎలా ఉంది..? నేటి నైజం దోర పాలన ఎలా ఉంది అంటూనే సీఎం కేసీఆర్ పై బాణం ఎక్కుపెట్టి ముందుకు కదిలిన వైఎస్ షర్మిళ  ఆలోచనకు..అదిలోనే స్పీడ్ బ్రేకులు పడుతున్నట్లు కనిపిస్తున్నాయి.. ఎంత వేగంగా పార్టీని స్థాపించారో..? అంతే వేగంగా పార్టీని ముంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.. మరో పార్టీలో  విలీనం చేసేందుకు అడుగులేస్తున్నట్లుగా ముమ్మరంగా ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆమె రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థికంగా మారిందనే చెప్పాలి..  పార్టీని విలీనం చేయడమా..? మరో పార్టీతో పొత్తుతో ముందుకు వెళ్లడమా అనే విషయంలో తర్జన భర్జన పడుతున్న అధినేత్రి.. మరో పార్టీ అధిష్టానం నిర్ణయం కోసం దేశ రాజదానిలో మకాం వేసినట్లు తెలుస్తోంది.. మట్టి పట్టుకుని ప్రమాణం చేసిన వైఎస్ షర్మిళ.. ఆ సీటులో పోటీ చేసేందుకు అధిష్టానం వద్ద మంకుపట్టు పట్టి వీడటం లేదని విశ్వసనీయ సమాచారం.. అయితే ఆ స్థానం.. లేదంటే ప్రస్తానమే..ప్రజాపోరాటమే అన్నట్లుగా  ఆ పార్టీ అధినాయకుడి వద్ద డిమాండ్ ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది.. ఇంతకు ఆమె అడుగులే ఎటువైపు పడుతున్నట్లు.. ఆమె రూట్ ఎటువైపు..? మరింత వివరాలు తెలుసుకుందాం..?

ఇది కూడా చదవండి: షర్మిళ..విలీనామా..? విహారమా..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానానంతరం తన కుమారుడు వైఎస్ జగన్ ను సీఎంగా చేసేందుకు వైఎస్ షర్మిళ రాజకీయ రంగప్రవేశం చేసింది. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో షర్మిళ ఎవరో సమాజానికి తెలియలేదు. కానీ వైఎస్ మరణం తరువాత అన్న కోసం రాజకీయ ప్రవేశం చేసిన వైఎస్ షర్మిళ ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసింది. ఆనాటి కాంగ్రెస్ సర్కార్ ను తూర్పారభట్టిన వైఎస్ షర్మిళ  రాష్ట్ర విభజన అనంతరం అన్నను సీఎంగా చేసేందుకు ఏపీలో పర్యటించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఏపీలో జగన్ సీఎం కాగా, 2021లో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చేసేందుకు గాను వైఎస్ షర్మిళ ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఖమ్మం కేంద్రంగా వైఎస్ షర్మిళ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి అధికారమే లక్ష్యంగా, రాజన్న రాజ్యం స్థాపన కోసం పార్టీని ప్రారంభించారు. ఆనాటి నుంచి నేటి వరకు విరామం లేకుండా అధికార పార్టీలపై పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రజలకు మరింతగా చేరువ అయ్యేందుకు వైఎస్ షర్మిళ మరోసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. దీంతో ప్రజలందరు కూడా అడుగడుగున నీరాజనాలు పలికారు. వైఎస్ఆర్ కూతురు మా వాడకు వస్తుందనే ఆలోచనతో ప్రజలందరు బ్రహ్మరథం పట్టారు.

== ప్రభుత్వాలపై విరుచకపడ్డ షర్మిళ

తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యమే లక్ష్యంగా పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిళ అవకాశం దొరికినప్పుడల్లా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచకపడ్డారు. ప్రభుత్వ లోపాలు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం పై ద్వజమెత్తారు. పార్టీ, ప్రభుత్వ ఆరోపణలే కాకుండా ప్రజావ్యతిరేక విధానలపై ఎండగడుతూనే వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ సంచలన రాజకీయ నాయకురాలుగా మారారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ సర్వత్ర హాట్ టాఫిక్ గా మారిపోయారు. మహుబాద్ ఎమ్మెల్యే పై చాలా ఘోరంగా అసభ్యపదజాలంను ఉపయోగిస్తూ ప్రసంగం చేశారు.

ఇది కూడ చదవండి: సీఎల్పీనేత భట్టి విక్రమార్క ను కలిసిన పొంగులేటి

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాఫిక్ గా మారింది. అంతేకాకుండా మంత్రులపై చాలా ఘోరంగా ఆరోపణలు చేశారు. దీంతో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు షర్మిళ పర్యటనను అడుగడుగున అడ్డుకున్నారు. పోలీసులు అరెస్టులు చేశారు. చివరికి జైలుకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆమె చేపట్టిన పాదయాత్రకు ఆటంకాలు, అవమానాలు, అరెస్టులు, కేసులు, నిర్బంధాలు ప్రయోగించినా లెక్క చేయకుండా షర్మిళ తన లక్ష్యం నేరవేరేందుకు 4వేల కిలోమీటర్ల దూరం పాటు పాదయాత్ర చేశారు. మొండిగా ముందుకు వెళ్లూ ప్రజల్లో గొప్ప పేరు సాధించారు.

== బీజేపీ వదిలిన బాణమని ప్రచారం

వైఎస్ షర్మిళ తెలంగాణలో రాజకీయ పార్టీని స్థాపించడం పట్ల తీవ్ర ఆరోపణలు వచ్చాయి. బీజేపీ వదిలిన బాణం అని, జగన్ వదిలిన బాణం అని, కేసీఆర్ వదిలిన బాణం అని ముమ్మరంగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి పుల్ స్టాఫ్ పెట్టేందుకు వైఎస్ షర్మిళ నానా తంటాలు పడ్డారనే చెప్పాలి.. ఎన్నో వేదికలపై ఆమె  ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది..

== రేవంత్ రెడ్డి పీసీసీ రావడంతో మారిన సమీకరణాలు

వైఎస్ షర్మిళ పార్టీ పెట్టే సమయానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వర్గపోరుతో తన్నులాడుకుంటూ వస్తున్నారు. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మునిగేపోయే పడవలా మారింది.. ఇక కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందనుకున్న సమయంలోనే  వైఎస్ షర్మిళ పార్టీని స్థాపించి కాంగ్రెస్ నేతలకు గ్యాలం వేసే పనిలో పడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా గోడమీద పిల్లిలా చూశారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం  రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీలో మరింతగా నూతన ఉత్తేజం వచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీ పుల్ జోస్ లో ఉంటే, వైఎస్ఆర్ టీపీ డౌన్ పాల్ లోకి వెళ్లింది.. రాజకీయ సమీకరణాలే మారిపోయాయి.

== షర్మిళ దారేటు..?

కర్నాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయం సాధించడంతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలే మారిపోయాయి. ముఖ్యమైన నాయకత్వం అంతా కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు. అప్పటి వరకు బీజేపీ పార్టీ వైపు వెళ్తారని అనుకున్నప్పటికి వారందరు కాంగ్రెస్ పార్టీ దూకుడుకు ఫిదా అవుతున్నారు. ఒకానోక దశలో వైఎస్ షర్మిళ కూడా బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని భావించారు. కానీ కర్నాటక గెలుపు తరువాత కాంగ్రెస్ పార్టీ  తెలంగాణ రాష్ట్ర ప్రజలందర్ని ఒక వైపు తిప్పుకుందనే చెప్పాలి. ఈ క్రమంలో వైఎస్ఆర్ టీపీ పార్టీ నుంచి పార్టీ నాయకులు బయటకు వెళ్లిపోతున్నారు.

ఇది కూడా చదవండి: భట్టి విక్రమార్క అభిమన్యుడు కాదు అర్జునుడు

కొత్తవారేవ్వరు పార్టీలో చేరడం లేదు. వైఎస్ షర్మిళ అనుకున్నంత స్థాయిలో కాకుండా కనీసం 5శాతం మంది ముఖ్యనాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదు. దీంతో వైఎస్ షర్మిళకు పార్టీ నడిపే విషయంలో క్లారిటీకి వచ్చినట్లు కనిపిస్తున్నారు. మరో పార్టీతో కలిసిపోకపోతే రాజకీయంలో వెనకబడి పోతామని భావించిన వైఎస్ షర్మిళ అందుకు గాను కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే ఆమె పార్టీలో తమ పార్టీని విలీనం చేస్తారా..? పార్టీతో పొత్తుపెట్టుకుంటారా..? అనే సందేహాలు నెలకొన్నాయి. వైఎస్ షర్మిళ కూడా అదే కన్ప్యూజన్ లో ఉండిపోయారు. పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలా..? పొత్తుతో రాబోయే అసెంబ్లీలో పోటీ చేయాలనే ఆలోచనలో వైఎస్ షర్మిళ సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్హ్యూలో మాట్లాడుతూ 4వేల కిలోమీటర్ల దూరం పాటు కాలినడకన నడిచిన నేను పార్టీని ఎలా విలీనం చేస్తారని అనుకుంటున్నారని మీడియాపై రుసరుసలాడారు. కానీ ఢిల్లీలో మాత్రం విలీనం చేసే ప్రక్రీయ జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం గాక తలబాదుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఆ పార్టీ నాయకత్వం మాత్రం విలీనం వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే అన్ని జిల్లాలో అత్యవసర సమావేశాలు నిర్వహించిన వైఎస్ఆర్ టీపీ నాయకులు కాంగ్రెస్ లో విలీనం అయితే బాగుంటుందని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

== పాలేరు కోసం పట్టువీడని షర్మిళ

బీఆర్ఎస్ పార్టీని ఓడించాలంటే కాంగ్రెస్ పార్టీ పొత్తు తప్పని సరి అవసరమని భావించిన వైఎస్ షర్మిళ ఆ విధమైన చర్చలు ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే పార్టీలో విలీనం చేయడమా..? పార్టీతో పొత్తుకు వెళ్లడమా అనే విషయం పక్కన బెడితే వైఎస్ షర్మిళ ఖమ్మం పర్యటనలో పాలేరు నుంచి పోటీ చేస్తున్నా అని మట్టి పట్టుకుని  ప్రజలకు హామినిచ్చిన వైఎస్ షర్మిళా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో విలీనం కోసం ప్రయత్నం చేస్తున్నప్పటికి పాలేరు అసెంబ్లీ స్తానానికే పోటీ చేస్తానని తెల్చి చెబుతున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: కేసీఆర్ పేరు కోసమే సచివాలయం: షర్మిళ

అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖమ్మం ఎంపీగా పోటీ చేయాలని, అవసరమైతే కేంద్రమంత్రి పదవి దక్కే అవకాశం ఉంటుందని నచ్చజెబుతున్నారంటా..? ఇక కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇటీవలే మీడియాతో మాట్లాడుతూ వైఎస్ షర్మిళది కూడా కాంగ్రెస్ కుటుంబమేనని,షర్మిళ తెలంగాణ కంటే ఏపీలో ఉంటే బాగుంటుందని సలహానిచ్చారు. ఈ విషయంపై వైఎస్ షర్మిళ సీరియస్ అయినట్లు సమాచారం. కచ్చితంగా తెలంగాణలో ఉంటానని, తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెడతానని తెల్చిచెప్పినట్లుగా సమాచారం. మరీ వైఎస్ షర్మిళ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? విలీనం చేస్తారా..? పొత్తులో పోటీ చేస్తారా..? అది కూడా అసెంబ్లీకి చేస్తారా..? ఎంపీగా పోటీ చేస్తారా..? అసలు తెలంగాణలో ఉంటారా..? ఏపీ రాజకీయాల్లోకి వెళ్తారా..? తెలుసుకోవాలంటే కొద్ది రోజుల వేచి చూడాల్సిందే..?