సొమ్మసిల్లి పడిపోయిన వైఎస్ షర్మిళ
== మీడియాతో మాట్లాడుతుండగా కిందపడిపోయిన షర్మిళ
== తప్పిన ప్రమాదం..
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
అకాల వర్షానికి నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు ఖమ్మంజిల్లాలో పర్యటించిన వైఎస్ షర్మిళకు అనుకోని సంఘటన జరిగింది.. ఆమె పంటలను పరిశీలిస్తూ మీడియాతో మాట్లాడుతుండగానే సొమ్మసిల్లి కిందపడిపోయింది… దీంతో పక్కనే ఉన్న పార్టీ జిల్లా కోఆర్డినేటర్ గడిపల్లి కవిత, పార్టీ నాయకులు పట్టుకుని కొంత గాలి కోసం ప్రయత్నం చేశారు. దీంతో వైఎస్ షర్మిళ అభిమానులు, పార్టీ నాయకులు ఆందోళన చెందినప్పటికి ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆమె తక్షణమే ఖమ్మం రూరల్ మండలంలోని తన క్యాంఫ్ కార్యాలయానికి చేరుకుని గంటపాటు విశ్రాంతి తీసుకున్నారు.
allso read- ఖమ్మంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి బిగ్ షాక్..*
పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇటీవలే అకాల వర్షాల కారణంగా ఖమ్మం జిల్లాలో వరి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా నష్టం జరిగింది. కల్లాల్లో మిర్చి, ధాన్యం, మొక్కజొన్నలు నీటిపాలైయ్యాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ మేరకు ఆదివారం ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో పంట నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించి, రైతులకు భరోసానిచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగానే ఆదివారం ఖమ్మం జిల్లాకు వచ్చిన ఆమె పలు మండలాల్లో పర్యటించి నష్టపోయిన పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంలోనే కొనిజర్ల మండలం తుమ్మలపల్లి లో వర్ష బాధిత రైతులకు పరామర్శ సమయంలో మీడియాతో మాట్లాడుతుండగా షర్మిళ సొమ్మసిల్లి పడిపోయారు. ఆదివారం ఎండ తీవ్రత అధికంగా ఉండటం, ఆమె ఎండలో పంటలను పరిశీలించేందుకు వెళ్లడం, ఆమె ఆహారం తినకపోవడం వల్ల కండ్లు తిరిగినట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. ఆ తరువాత మధ్యాహ్నం భోజనం విరామం అనంతరం కారేపల్లి మండలంలోని చీమలపాడులో ఇటీవలే అగ్నిప్రమాద ఘటనలో మరణం పొందిన వారి కుటుంబాలను పరామర్శించారు. వారికి అర్థిక సహాయంచేశారు.
ఇది కూడ చదవండి: *తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఊసరవెల్లి లా మారాడు : షర్మిళ