తాగాలే.. తినాలే.. తొంగోవాలే..
== ఇది కేసీఆర్ సిద్దాంతం
== కేసీఆర్ పై షర్మిల పైర్
== ఎక్కడ చూసినా వైన్స్… బెల్ట్ షాపులు
== రాష్ట్రంలో దోపిడీ రాజ్యం…దొంగల రాజ్యం నడుస్తోంది
== తెలంగాణ లో అప్పు లేని కుటుంబం లేదు
== కేసీఆర్ అరాచకాలను ఎవరు అడుగుతున్నారు..?
== ప్రతిపక్షం..పాలకపక్షం ఒక్కటైంది
== ప్రజల పక్షాన నిలబడేందుకే మీముందుకు వచ్చా
== ఆశీర్వదిస్తే రాజన్న రాజ్యం తెస్తా
== నేలకొండపల్లి పాదయాత్రలో వైఎస్ షర్మిల భరోసా
నేలకొండపల్లి/ఖమ్మంప్రతినిధి, జూన్ 18(విజయంన్యూస్)
తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రతి రోజు తాగాలే..తినాలే.. తొంగోవాలే.. అనే సిద్దాంతంతో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని, అందులో భాగంగానే ప్రజలందర్ని మాయమాటలతో గారడి చేసి మోసం చేస్తున్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. 98వ రోజు ప్రజాప్రస్థానం పాదయాత్ర ఖమ్మం జిల్లా, మధిర నియోజకవర్గం, ముదిగొండ మండలంలోని కట్టకూరు గ్రామంనుంచి ప్రారంభమైంది. అనంతరం మాదాపురం గ్రామం మీదుగా మధిర నియోజకవర్గంలోకి చేరుకుంది. పాదయాత్రకు ప్రజలు భారీగా తరలివచ్చి మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. పాలేరు నియోజకవరగం్ నేలకొండపల్లి మండల పరిధిలోని శంకరగిరి తండా, రాజేశ్వరాపురం, అమ్మగుడెం, కోరుట్ల గూడెం, అనంత నగర్, కోనాయిగుడెం, ఆరెగుడెం, ఆచరగూడెం గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగింది. రాజేశ్వరాపురం గ్రామం వద్ద 1300 కిలోమీటర్లమైలురాయికి పాదయాత్ర చేరుకుంది.
allso read- ఇది బీర్లు..బార్ల తెలంగాణ.. :వైఎస్ షర్మిల
రాజేశ్వరాపురం వద్ద వైఎస్సార్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళ్లు అర్పించాను. అనంతరం పాదయాత్రను కొనసాగించాను. దారి పొడవునా పలువురు ప్రజలు తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నేలకొండపల్లి మండలం ఆచర్లగుడెం గ్రామ ప్రజలతో మాట – ముచ్చట కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ దళితుల భూములే ప్రభుత్వానికి కనిపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు కట్టడానికి దళితులకు ఇచ్చిన భూములే కావాలా..? ధరణి పేరు చెప్పి మొత్తం భూములు తారు మారు చేశారు. ప్రజలకు ఎకరం భూమి ఉన్నా రికార్డులలో లేనట్లు చూపిస్తుంది. భూముల రికార్డులను సరి చేయాలి అంటే లంచాలు పెట్టాల్సి వస్తుందని, చివరికి భూముల కోసం తాళిబొట్టు కూడా అమ్ముకోవాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రాజకీయాల్లో నీతి లేకుండా పోయిందని, రాజకీయాల్లో మంచితనం,నిజాయితీ లేకుండా పోయిందన్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ ఉన్నప్పుడు మాట ఇస్తే మాట కోసం ప్రాణం ఇచ్చే వారని, వైఎస్సార్ లా మాట మీద నిలబడే నాయకుడు లేకుండా పోయాడని అన్నారు. అందుకే వైఎస్ఆర్ ఆశీస్సుల మేరకు ఆయన ఆశయ సాధనే లక్ష్యంగా పనిచేసేందుకు వైఎస్సార్ తెలంగాణ పార్టీను ఏర్పాటు చేశామన్నారు. టీఆరెఎస్ ప్రజలకు న్యాయం చేయక పోతే గెలిపించిన కాంగ్రెస్ సైతం టీఆరెఎస్ సంక నెక్కిందని ఆరోపించారు. కేంద్రం లో బీజేపీ ఉంది..కేసీఆర్ అవినీతి ఆధారాలు ఉన్నాయని చెప్తోందని, కానీ ఏ ఒక్కటి కూడా బయట పెట్టలేదని, ఆ రెండు పార్టీలు దొందూదొందేనని ఆరోపించారు. ప్రజల పక్షాన ఎవరు నిలబడేవారే లేకుండా పోయారని, అందరూ చక్కగా ఉంటే నేను రాజకీయాల్లోకి రాకుండా ఉండేదాన్ని అని, వైఎస్సార్ తెలంగాణ పార్టీ పుట్టక పోయేదని అన్నారు. ప్రజలకు అన్యాయం చేసే వారికి, పార్టీలు మారే వారికి బుద్ది చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని జోస్యం చెప్పారు. తెలంగాణ లో కేసీఆర్ ఇచ్చిన ఏ హామీ కూడా నిలబెట్టుకోలేదని, రాష్ట్రంలో దోపిడీ రాజ్యం…దొంగల రాజ్యం నడుస్తోందని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసిన వైన్స్… బెల్ట్ షాపులు ఉన్నాయని, తాగలే ..తోంగోవాలే..ఇదే కేసీఆర్ సిద్ధాంతమని ఆరోపించారు. పెద్ద చదువులు చదివిన నిరుద్యోగులు పత్తి వేరపోతున్నారని, సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కావడం లేదన్నారు.
allso read- షర్మిల..దమ్ముంటే నాపై పోటీ చేసి గెలువు
మాట్లాడిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఇది రౌడీ రాజ్యం ..దొంగల రాజ్యం..దోపిడీ రాజ్యమని అన్నారు. . ప్రజల డబ్బులు దొంగల్లా టీఆరెఎస్ నేతలు మింగుతున్నారని ఆరోపించారు. టీఆరెఎస్ పార్టీ అకౌంట్ లో 860 కోట్లు ఉన్నాయి అంటే… ఎంత తింటున్నారో అర్థం చేసుకోవాలని అన్నారు. నీతి మాలిన నాయకులకు బంగారు తెలంగాణ అయ్యిందని, తెలంగాణ లో అప్పు లేని కుటుంబం లేనేలేదని అన్నారు. కూలి నాలి చేసి చదివిస్తే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవాలా..? కేసీఆర్ అరాచకాలను ఎవరు అడుగుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ లో ఎవరికి విలువే లేదు..పేదవారిని కేసీఆర్ పురుగుల్లా చూస్తున్నారని అన్నారు. ఎన్నికలు వస్తుంటే, గాడిదకు రంగు పూసి ఆవు అని నమ్మించేందుకు మళ్లీ మీ ముందుకు వస్తాడని పేర్కోన్నారు. మనం ఓట్లు వేస్తున్నాం… గెలుస్తున్నడు..ఫామ్ కి పోతున్నాడని ఆరోపించారు. ఈ సారి టీఆరెఎస్ కి వోటు వేస్తే మీ బిడ్డలే మిమ్మలిని క్షమించరని ఆలోచన చేసి..మీ కోసం నిలబడే వారికోసం… తపించే వారికోసం ఓటు వేయండిఅని కోరారు. వైఎస్సార్ హయాంలో ప్రతి వర్గం బాగుపడిందని, వైఎస్సార్ లాంటి న్యాయకత్వం రావాలి అంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నీ ఆశీర్వదించాలని కోరారు.
నియోజకవర్గంలో స్థానిక టీఆరెఎస్ నేతలు అరాచకాలు చేస్తున్నారని, కులాల పేరు మీద తిడుతున్నారని ఆరోపించారు. -. భూములు గుంజుకుంటున్నారని, దళితులకు ఇచ్చిన భూముల్లో ప్రభుత్వ కార్యాలయాలు కడుతున్నారని దుయ్యబట్టారు.
allso read- పాలేరు నుంచే షర్మిల పోటీ