Telugu News

ఇది బీర్లు..బార్ల తెలంగాణ.. :వైఎస్ షర్మిల

రాష్ట్రంలో మహిళలకు రక్షణలేదు

0

ఇది బీర్లు..బార్ల తెలంగాణ..

== తెలంగాణలో మంచినీళ్లు నిల్.. మద్యం పుల్

== రాష్ట్రంలో మహిళలకు రక్షణలేదు

== టీఆర్ఎస్ నేతల పిల్లలే ఆగయిత్యాలకు పాల్పడుతున్నారు

== ఆడపిల్లల వైపు చూస్తే గుడ్లుపీకుతానన్న సీఎం…టీఆర్ఎస్ నేతల పిల్లలకు గుడ్లు పీకడంలేదేందుకు

== త్యాగాలు ప్రజలవి..బోగాలు మీవా..?

== సీఎం కేసీఆర్ పై మండిపడిన వైఎస్ షర్మిల

== ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర

 

allso read- షర్మిల..దమ్ముంటే నాపై పోటీ చేసి గెలువు

ముదిగొండ/ఖమ్మంప్రతినిధి, జూన్ 17(విజయంన్యూస్)

ఇది బీర్లు, బార్ల తెలంగాణ అని,  రాష్ట్రంలో మంచి నీళ్ళు లేవు కానీ…మద్యం మాత్రం ఏరులై పారుతుందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. వైఎస్ఆర్ టీపీ అధికారం లోకి వస్తే బెల్ట్ షాపులు పూర్తిగా రద్ద చేస్తానని హామినిచ్చారు. మహాప్రజాప్రస్థానం పేరుతో వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర శుక్రవారం ఖమ్మం నగరంలో ప్రారంభమై  మున్నేరు బ్రిడ్జిమీదగా ముదిగొండ మండలం చేరింది. ముదిగొండ మండలంలోని పార్టీ కార్యకర్తలు, నాయకులు వైఎస్ షర్మిలకు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగున మహిళలు తిలకం దిద్ది, హారతులిస్తూ స్వాగతం పిలికారు. ఈ సందర్భంగా ముదిగొండ మండలం కట్టకూరు గ్రామంలో ఏర్పాటు చేసిన మాట – ముచ్చట కార్యక్రమంలో వైఎస్ షర్మిల మాట్లాడారు. మహిళలకు తెలంగాణ లో రక్షణ లేదని, చిన్న పిల్లల పై ఆగయిత్యాలు జరుగుతున్నాయని ఆరోపించారు. టీఆరెఎస్ నేతల పిల్లలే రేపులు చేస్తున్నారని, ఆడపిల్లల వైపు చూస్తే గుడ్లు పీకుత అన్నారు కేసీఆర్, ఇప్పుడు మీ పార్టీ నేతల గుడ్లు ఎందుకు పీకడం లేదు ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వ వాహనాల్లో మీ పార్టీ నేతల పిల్లలు అత్యాచారాలు చేస్తే చర్యలు లేవా..? అని ప్రశ్నించారు.

allso read – పాలేరు నుంచే షర్మిల పోటీ

ఉన్నోడికి ఒక న్యాయం…లేనొడికి ఒక న్యాయమా..? తెలంగాణ ప్రభుత్వంలో అంటూ ప్రశ్నించారు. టీఆరెఎస్ పాలన లో ఆడవారికి రక్షణ ఎక్కడ ఉందో చెప్పాలని, టీఆరెఎస్ నేతలు మొత్తం రౌడీలు గా తయారయ్యారు.. మాఫియా లా మారారని అన్నారు. ఇసుక దగ్గర నుంచి కాంట్రాక్ట్ ల వరకు అన్ని మాఫియాలే చేస్తున్నారని ఆరోపించారు. బంగారు తెలంగాణ కేసీఆర్ పిల్లలకు అయ్యిందని, ప్రజలకు కాలేదని పేర్కోన్నారు. కేసీఆర్ బిడ్డ ఓడిపోతే మళ్ళీ తీసుకు వచ్చి ఎమ్మెల్సీ ఇచ్చారని, పార్టీ కోసం, తెలంగాణ కోసం పోరాటం చేసిన ఎందరో ఉద్యమకారులున్నారని, వారికేందుకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని ప్రశ్నించారు. బోగాలు మీవి త్యాగాలు ప్రజలవా..? అంటూ ప్రశ్నించారు. ఎన్నికలకు ఇంకా ఏడాది ఉందని, ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. మీకోసం పని చేసే వారిని ఎన్నుకోవాలని షర్మిల కోరారు.

== ప్రజలకు న్యాయం చేయని సర్కార్ సచ్చినట్లే

తల నరికే టోనికి తల్వార్ ఇస్తే ఏమవుతుందో…కేసీఆర్ కి రెండు సార్లు ముఖ్యమంత్రి అయితే అదే అవుతందని యద్దేవా చేశారు. ప్రజలకు న్యాయం చేయని సర్కార్ సచ్చినట్లేనని,  ప్రజలకు మంచి చేయని ముఖ్యమంత్రి సచ్చినట్లేనని అన్నారు.  ప్రజలకు సమస్యలు ఉన్నాయి అని తెలిసి ఎత్తి చూపడానికి పాదయాత్ర చేస్తున్నానని,  ప్రతి చోట ప్రజలు సమస్యలే కదా చెప్పేదని అన్నారు.  తెలంగాణ లో అసలు నాణ్యమైన చదువు ఉందా..?అని ప్రశ్నించారు.  వైఎస్సార్ బాసర లో త్రిబుల్ ఐటీ స్థాపించారని,  ఇప్పుడు బాసర త్రిబుల్ ఐటీ నీ బ్రష్టు పటించారని ఆరోపించారు.  అక్కడ పిల్లలకు కనీసం బొజనం కూడా పెట్టడం లేదని ఆరోపించారు. మూడు రోజులుగా ధర్నా చేస్తుంటే కనీసం పట్టించుకోవడం లేదని, ముఖ్యమంత్రికి కనికరం లేదన్నారు.

allso read- ఆ ఇద్దరికి చెక్ పెట్టేందుకేనా..?

కౌలు రైతు తెలంగాణ లో రైతే కాదట..? అని దుయ్యబట్టారు.  రైతుకు గౌరవం లేదు..రైతు కూలీలకు గౌరవం లేదని,  భూమి లేని వాళ్ళు కేసీఆర్ దృష్టిలో మనుషులే కాదని అన్నారు.  ఎన్నికలప్పుడు వస్తారు… బిర్యానీ లు పెడతారు . ఆహా ఓహో అనిపిస్తారని,  తర్వాత మీ మొహం కూడా చూడరని షర్మిల ప్రజలకు సూచించారు. మీ సమస్యల కోసమే నేను పాదయాత్ర చేస్తున్నానని,  మీ కోసం పోరాటం చేసే వారిని  మరిచి పోతే మన బ్రతుకులు ఎప్పటికీ మారవని అన్నారు. ఎన్నికల పేరు చెప్పి డబ్బులు ఇస్తే తీసుకోండని, కానీ ఓటు మాత్రం మీకోసం పనిచేసేవారికి వేయాలని కోరారు. పెద్ద పెద్ద ప్రాజెక్ట్ ల పేరు చెప్పి ఎక్కువ కమీషన్లు నొక్కేశారని, అందుకే ఇప్పుడు పెద్ద పెద్ద గడీలు కట్టుకున్నారని తెలిపారు.   వైఎస్సార్ మంచి నాయకుడు..అందుకే మహా నాయకుడు అయ్యాడని, ఇవ్వాళ్టి ఆయన పథకాలు ప్రజల గుండెల్లో నిలిచి పోయాయని అన్నారు. వైఎస్సార్ ప్రజలకు మంచి చేశాడు కాబట్టే… ఆయన్ను ప్రేమిస్తున్నారని తెలిపారు.  వైఎస్సార్ తెలంగాణ పార్టీ లక్ష్యం ఒకటే… వైఎస్సార్ సంక్షేమ పాలన ను తిరిగి తీసుకు రావడమేనన్నారు.  కేసీఆర్ మంచంకోళ్లు ఎత్తుకు పోయే రకమని, 8 ఏళ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. ప్రజలందరు వైఎస్ఆర్టీపీని ఆదరించాలని, ఆ పార్టీ నాయకులను గెలిపించాలని కోరారు.

4 Attachments