పట్టా భూముల ముసుగులో జీరో ఇసుక దందా
? కిన్నెరసాని వాగును తోడేస్తున్న ఇసుకాసురులు
? ఇసుక మాఫియా లో ఆంధ్ర కాంట్రాక్టర్ల హస్తం
? ఏజెన్సీలో రాత్రిపూట సాగుతున్న దోపిడీ
? రాత్రి మొదలు అంతా జీరో మయం..!
?చూసీచూడనట్టు వదిలేస్తున్న స్థానిక అధికారులు..
? మామూళ్ల మత్తులో టిఎస్ఎండిసి అధికారులు..!
(రాజశేఖర్ రెడ్డి. బూర్గంపహాడ్ -విజయం న్యూస్ )
పట్టా భూములముసుగులో ఇసుక మాఫియా జీరో వ్యాపారం సాగిస్తూ కోట్ల రూపాయల దోపిడీ పాల్పడుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సోంపల్లిలో పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు జరిపేందుకు టిఎస్ఎండిసి,మైనింగ్ అధికారులు అనుమతులు జారీ చేశారు.ఈ అనుమతుల ను అడ్డం పెట్టుకొని కొంతమంది ఆంధ్ర కాంట్రాక్టర్లు లోకల్ భడా వక్తుల తో కలిసి దొడ్డి దారి లో జీరో ఇసుక దందా కొనసాగిస్తున్నారు.
also read;-నూతన కలెక్టరేట్ భవననిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి- మంత్రి పువ్వాడ.
మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో కిన్నెరసాని వాగులో ఈ ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్నారు. వాగులు వంకలు ఆనుకుని ఉన్న భూముల్లో ఇసుక మేటలు వేశాయని వాటికీ అనుమతులు పొంది ఆ తర్వాత ఏకంగా నదిలోనే ఇసుక తవ్వకాలు జరిపి జీరో ఇసుక వ్యాపారం నిర్వహిస్తున్నారు.ఈ జీరో ఇసుక వ్యాపారానికి టిఎస్ఎండిసి అధికారులు, కింది స్థాయి పోలీసు అధికారులు, రెవిన్యూ అధికారులు అండగా ఉండటం వలనే జీరో ఇసుక దందా అరికట్ట లేని పరిస్థితి నెలకొందని స్థానికులు ఆరోపిస్తున్నారు . బూర్గంపహాడ్ మండలం సోంపల్లి లో ఆంధ్ర కాంట్రాక్టర్ లు పట్టా భూమి పేరున అనుమతి పొందారు. ఇదే అనుమతి అడ్డంపెట్టుకుని ఇసుక మాఫియా సోంపల్లె లోని సర్వే నంబర్ 203/2/A,203/3/A తవ్వకాలు జరుపుతున్నారు. వాస్తవంగా సోంపల్లి గ్రామంలోని కాక ధర్మయ్య పేరు పై వున్నా పట్టా భూమి పేరున 25 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలకు జిల్లా సాండ్ కమిటీ ఆమోదం తెలిపింది.
also read;-పాలకుల నిర్లక్ష్యంతో శిథిలావస్థలో విజ్ఞాన భాండాగారం
అనుమతులు ఇచ్చిన సోంపల్లి రాంప్ ఆంధ్ర సరిహద్దులో వుండటంతో అక్రమ ఇసుక రవాణాకు సులువుగా మారింది. పేరుకు పట్టా భూముల్లో ఇసుక తవ్వినట్లు చెబుతున్నా పట్టా భూముల్లో ఇసుక తవ్వకుండ్డ వాగులో భారీ యంత్రాలతో నది మధ్య భాగంలో ఇసుక తోడుతు ఖమ్మం కొత్తగూడెం పాల్వంచ పరిసర ప్రాంతాలకు తరలిస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. పట్టా భూముల పేరుతో ఇసుక మాఫియా జీరో దందాకు పాల్పడుతోంది. పట్టా భూముల పేరుతో జీరో ఇసుక వ్యాపారం చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్న అక్రమార్కులపై చర్యలు చేపట్టేందుకు జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టాలని అక్కడి ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.
నడి వాగులో భారీ యంత్రాలతో లోడింగ్
సోంపల్లి కిన్నెరసాని వాగులు పట్టా భూముల పేరట వాగు నడి గర్భం నుంచి భారీ యంత్రాల సహాయంతో ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. దీన్ని ఆపాల్సిన టిఎస్ఎండిసి అధికారులు, రెవిన్యూ, పోలీసులు తమకేమి పట్టనట్లు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడంతో అధికారుల తీరును స్థానికులు వ్యతిరేకిస్తున్నారు.
వాగు కు అడ్డుకట్ట వేసి తోలకాలు
నడి వాగులో వాటర్ జరగకుండా భారీ రోడ్డు వేసి ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఇలా చేయడం వలన వర్షం పడ్డప్పుడు గాని, పైన డాం నుంచి వాటర్ కిందకు వదిలినప్పుడు గాని వాటర్ ప్రవాహం సాఫీ గా పోయే మార్గం లేనందువల్ల వరద ఉధృతి వాగుకి అనుకోని ఉన్న గ్రామంలోకి వచ్చే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. అంతే కాకుండా వాటర్ ఫ్లోటింగ్ జరగకుండా ఇలా అడ్డుకట్ట వేయడం వల్లనా దిగువన ఉన్న పంట పొలాలు నీరు లేక ఎండి పోతున్నాయి అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులు అమ్మకి నీరెత్తినట్లుగా ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది.
పర్మిషన్ తెలంగాణ.. రవాణా ఆంధ్రా నుంచి..
మండల పరిధిలోని స్వతంత్ర రెవెన్యూ లో కొంత మంది రైతుల పంట పొలాలల్లో ఇసుకమేట వేసిందన్న పేరుతో వారి పేరు పై ప్రభుత్వ పర్మిషన్ తో ఇసుక ర్యాంపు ను లోకల్ గా ఉన్న బడాబాబుల సాయంతో ఆంధ్ర కాంట్రాక్టర్లు నడిపిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని ఆంధ్ర ప్రదేశ్ మీదగా ఇసుక రవాణా చేస్తున్నారు. అసలు ఆంధ్ర నుంచి ఎలా రవాణా చేస్తున్నారని అర్థం కాని ప్రశ్నగా మిగిలి పోతుంది.
ప్రమాదంలో స్థానికులు,పంట పొలాలు.
సోంపల్లి పంటపొలాల్లో ఇసుక మేటల పేరుపై నిర్వహిస్తున్న రాంప్ వల్ల స్థానిక తాను ప్రజలకు వారి పంట పొలాలకు ప్రమాదం పొంచి ఉంది. ఊరి కి సరిహద్దులో ఉన్న వాగు అవ్వడం వలన భారీ ఇసుక తవ్వకాల వల్ల ప్రమాదం పొంచి ఉంది. రాంప్ నిర్వాహకులు భారీ యంత్రాల సాయంతో పెద్ద పెద్ద కంద్దాకాలు తీసి ఇసుకతో ఉండడం వల్ల ఊరికి పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం అక్కడికి సమీపంలో ఎడ్లబండిపై వాగు నుంచి వెళ్తున్న రైతు కూలీలు అలాంటి కందకంలో పడి 6 గురు మృతి చెందిన విషాద సంఘటన ఊర్లో స్థానికులు మర్చిపోకముందే మళ్లీ అలాంటి భారీ కందకాలు తోడుతున్నారు. మళ్ళీ ఏదైనా సంఘటన జరిగితే ఏమో అని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు.
స్థానికుల పిర్యాదు తో అక్రమ ఇసుక లారీ ని పట్టుకున్న పోలీస్లు
అక్రమ ఇసుక రవాణా చేస్తున్న లారీని శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు స్థానికుల పిర్యాదు మేరకు పోలీస్ లు పట్టుకొని స్టేషన్ కు తరలించారు. స్టేషన్ కు తరలించిన గంట తరవాత స్టేషన్ నుంచి లారీ మాయమైంది. ఈ విషయంపై స్టేషన్ ఎస్ఐ దారం సురేష్ ను వివరణ కోరగా అధిక లోడుతో వెళ్తున్న లారీ ని స్థానికులు పిర్యాదు మీదకు స్టేషన్ కి తరలిచామని బిల్లులు చూపించడంతో అట్టి లారీని వదిలేసామని ఎస్సై అన్నారు. తెల్లారు ఝామున నాలుగు గంటలకి ఇసుక లోడింగ్ పర్మిషన్ ఉందా అని, అసలు ఆ టైంలో ఇసుక రవాణా కు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అని స్థానిక ప్రజలు పోలీస్ ల తీరు పై పలు అనుమానలు వ్యక్తం చేస్తున్నారు.
స్థానిక యువనేత ఈ విషయంపై పిర్యాదు చేయడానికి కోర్టు వెళ్తున్నట్టు సమాచారం
బూర్గంపహాడ్ మండలం సోంపల్లి గ్రామంలో ఇసుక ర్యాంపు లో జరుగుతున్న అక్రమాలపై, భారీ కందకాల వల్ల ఊరికి పెనుప్రమాదం జరగవచ్చన్న స్థానికుల ఆందోళనతో స్పందించిన అక్కడి స్థానిక యువ నేత గ్రామ ప్రజలతో కలిసి కోర్టును ఆశ్రయిస్తున్నటు సమాచారం.