జీళ్ళచేరువు శ్రీ వేంకటేశ్వర దేవస్థానం ఘనంగా గోదాదేవి కల్యాణం
%% కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సంబరాలు
(కూసుమంచి-విజయంన్యూస్)
కూసుమంచి మండలంలోని జీళ్లచెరువు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం గోదా రంగనాయకుల స్వామి కళ్యాణం వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ బొడ్డు నరేందర్ అధ్యక్షతన ప్రధాన అర్చకులు సీతారామానుజచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా గోదారంగనాథుల కల్యాణవేడుకలను వైభోపేతంగా నిర్వహించారు. సుమారు 20 మంది దంపతులు పీఠలపై కుర్చోని పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సఖ్యంలో హాజరైయ్యారు.
also read :-రాష్ట్ర ప్రజలకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు..మంత్రి పువ్వాడ.
కోవిడ్ నిబంధనల మేరకు కల్యాణ వేడుకలను నిర్వహించారు. అనంతరం భక్తులకు పలహారాలను అందించారు. అలాగే బోగి పండుగ సందర్భంగా దేవాలయానికి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చి పూజలు చేసి స్వామివారి దర్శనం పొందారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఈవో నారాయణ చార్యులు, జూనియర్ అసిస్టెంట్ రాందాస్, పాలకమండలి సభ్యులు మామిళ్లపల్లి రామాచారి, బుర్లే వీరబాబు, చింతలపాటి ఆశ కుమారి,ఎంపీటీసీ ఉమ శ్రీనివాస్, భక్తులు పాల్గొన్నారు.