Telugu News

లక్ష్మీదేవిపల్లిలో కాంగ్రెస్ లో చేరిన జడ్పీటీసీ 

కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు*

0

లక్ష్మీదేవిపల్లిలో కాంగ్రెస్ లో చేరిన జడ్పీటీసీ 

==  కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు*

== లక్ష్మీదేవిపల్లి జెడ్పీటీసీని కండువా కప్పిన మంత్రి పొంగులేటి*

(ఖమ్మం-విజయం న్యూస్):

వివిధ పార్టీలకు చెందిన అనేక మంది ప్రజాప్రతినిధులు, నాయకులు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి మంత్రి పొంగులేటి సమక్షంలోగురువారం చేరారు. ఖమ్మంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో లక్ష్మీదేవిపల్లి మండల జెడ్పీటీసీ మేరెడ్డి వసంత, ప్రశాంతినగర్ ఎంపీటీసీ ముక్కెర శిరీషాలతో పాటు తాజా మాజీ సర్పంచ్ లు, వార్డు మెంబర్లు, మైనారిటీ నాయకులు, సినీయర్ పార్టీ నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ లో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి:- మాజీ ఎమ్మెల్యే కందాళకు బిగ్ షాక్..