Telugu News

విద్యార్థులను ఆలోచింపజేసీన సాహిత్యవేత జూలూరు

== గాయత్రి డిగ్రీ కళాశాల ఫేర్వెల్ డే వేడుకలు .

0

విద్యార్థులను ఆలోచింపజేసీన సాహిత్యవేత జూలూరు

 

== గాయత్రి డిగ్రీ కళాశాల ఫేర్వెల్ డే వేడుకలు .

 

== జ్యోతి ప్రజల్వన చేసి ప్రారంభించిన సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ .

 

( ఖమ్మం-విజయం న్యూస్);-

విద్యార్థులు మంచి భవిష్యత్ ను నిర్మించుకోవాలని, దేశ భవిష్యత్ మీ చేతిలో ఉందని, దానిని కాపాడాలంటే కచ్చితంగా లక్ష్యసేదన దిశగా అడుగులు వేయాలంటూ సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ అన్నారు. ఆయన ప్రసంగం విద్యార్థులను ఆలోచింపజేశాయి. ఖమ్మం త్రీటౌన్ గాంధీచౌక్లో ఉన్న గాయత్రి డిగ్రీ కళాశాల ఫేర్వెల్ డే వేడుకలను భక్త రామదాసు కళాక్షేత్రంలో ప్రిన్సిపల్ & సెక్రటరీ సునీల్ కుమార్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మెన్ జూలూరు గౌరీశంకర్ పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ఆట పాటలతో పాటు సాహిత్యం కలిగి ఉండాలని, అలాగే క్రమశిక్షణతో మెలిగి దేశ భవిష్యత్తును, మంచి సమాజాన్ని నిర్మించే విధంగా దేశ సంస్కృతిని కాపాడాలని అన్నారు.

also read :-వలస కార్మికులకు అండగా ఉంటాం: ఎండీ.జావిద్

అలాగే మరో అతిథి మువ్వా శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి తల్లిదండ్రులకు మరియు కాలేజ్ కి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అందుకోవాలని, యువత ఎటువంటి మారకద్రవ్యాలకు, చెడు అలవాట్లకు ప్రభావితం కావొద్దన్నారు. మరో అతిథి కేయూ రిటైర్డ్ కమతేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఉద్యోగాలు సాధించాలని కోరారు. మహనీయులను ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవలి అన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు విశేషముగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ జూనియర్ కళాశాల జిల్లా అధ్యక్షులు వీరారెడ్డి, కళాశాల డైరెక్టర్ కుటుంబరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.