Telugu News

ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైల్ లో పొగలు

== నెక్కొండలో ఆపేసి తనిఖీలు

0

ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైల్ లో పొగలు

(వరంగల్‌-విజయంన్యూస్)
విశాఖ నుంచి ఢల్లీ వెళ్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో వరంగల్‌ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్‌ సవిూపంలో దాదాపు ఒక గంట పాటు రైలుని నిలిపివేశారు. ఏపీ ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌ 6 బోగీలో ఒక్కసారిగా పొగలు రావడంతో నెక్కొండ స్టేషన్‌లో డ్రైవర్‌ అప్రమత్తమై రైలును నిలిపివేశారు. ఒక్కసారిగా పొగలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ప్రయాణికులు రైల్లో నుంచి పరుగులు తీశారు.

also read :-రైతులందరికి పాసుపుస్తకాలు అందిస్తాం : కలెక్టర్

రైల్వేస్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు కూడా భయంతో పరుగులు పెట్టారు. రైలు బ్రేకులు జాం కావడంతో పొగలు వచ్చి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. నెక్కొండ స్టేషన్‌లోనే ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైలును నిలిపివేసి తనిఖీలు చేస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. దీనిపై విచారణ చేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ
ఘటనలో అందరూ క్షేమంగా ఉండడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విశాఖ నుంచి న్యూ ఢల్లీి వెళ్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో శుక్రవారం తెల్లవారుజామున పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేశారు. లోపాన్ని గమనించిన రైలు సిబ్బంది వెంటనే రైలును నిలిపివేశారు. దీంతో వరంగల్‌ జిల్లా నెక్కొండ రైల్వేస్టేషన్‌లో రైలు నిలిచిపోయింది. ఎస్‌`6 బోగీ నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయని ప్రయాణికులు తెలిపారు.