Telugu News

ఎమ్మెల్యేకు అస్వస్థత.. ఎందుకంటే..?

హాటాహుటీన ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించిన మరో ఎమ్మెల్యే

0

భద్రాచలం ఎమ్మెల్యే కు అస్వస్థత…!

– హైదరాబాద్ ఆస్పత్రికి తరలించి చికిత్స

— ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించిన భట్టి విక్రమార్క

(విజయం – భద్రాచలం న్యూస్) :

తెలంగాణ రాష్ట్రంలో ఓ గిరిజన నియోజకవర్గానికి.. పర్యటక ప్రాంతం.. పుణ్యక్షేత్రం మైన నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే అస్వస్థతకు గురైయ్యారు.. దీంతో కుటుంబ సభ్యులు హాటాహుటీన ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలకు నాయకుడైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించారు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగితెలుసుకున్నారు.పూర్తి వివరాల్లోకి వెళ్తే

భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఫుడ్ పాయిజనింగ్ తో అనారోగ్యానికి గురైన ఆయనను హుటాహుటిన హైదరాబాద్ తరలించి అపోలో హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే వీరయ్య ఆరోగ్యం నిలకడగా ఉందని ఎమ్మెల్యే పిఎ ఆదిత్య తెలిపారు. పొదెం వీరయ్య ఆరోగ్యం గురించి తెలియగానే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఎమ్మెల్యే ఆరోగ్యంపై సంబంధిత ఆసుపత్రి వర్గాల నుంచి ఆరా తీశారు. ఎవరు అధర్య పడొద్దని త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటారని బట్టి విక్రమార్క చెప్పారు.

also read:- విద్యార్థులకు కరోనా.. హై స్కూల్లో టెన్షన్