Telugu News

తిరుపతి లో పర్యటిస్తున్న సీఎం

జగన్ వరదబాధితుల తో మాట్లాడి భరోసా కల్పిస్తున్న సీఎం జగన్

0

తిరుపతి లో పర్యటిస్తున్న సీఎం

జగన్ వరదబాధితుల తో మాట్లాడి భరోసా కల్పిస్తున్న సీఎం జగన్

కృష్ణానగర్లో వరదలకు దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించిన సీఎం జగన్

(తిరుపతి-విజయం న్యూస్)

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తిరుపతి లోపర్యటీస్తున్నారు.. ఇటీవలే తిరుపతిలో భారీ వర్షాలు కురుసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున గృహ ఆస్తి నష్టం జరిగింది. వందలాది మంది నిరుపేదలు తీవ్రంగా నష్టపోయి నిర్వసితులైయ్యారు.. ఈ క్రమంలో స్పందించిన సీఎం జగన్ తిరుపతిలో పర్యటన చేస్తున్నారు.

కాలినడకన ప్రతి వీధి తిరుగుతూ వరదలకు కూలిపోయిన ఇండ్లను పరిశీలించి బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్నారు. కూలిపోయిన ఇళ్ల నిర్మాణంలో 13 రోజులలో నూతన ఇళ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చిన సీఎం జగన్, నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు. ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటానని హామినిచ్చారు. వరదలు, వర్షాల వల్ల 293 ఇళ్లు కొట్టుకుపోయినట్లు సీఎం జగన్ కు అధికారులు తెలియజేశారు. దీంతో సీఎం జగన్ బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. తానున్నానంటూ, అందరికీ అండగా ఉంటానని భరోసా కల్పిస్తున్నారు.\

also read :- మృత్యువులోను వీడని బంధం*