ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడు మృతి
(మహబూబాబాద్- విజయం న్యూస్);-
మహబూబాబాద్ జిల్లా పరిధిలోని శనిగపురం గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ యువకుడు చనిపోయిన సంఘటన శుక్రవారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం కందుకూరి మురళి, విజయ దంపతులకు కుమారుడు ఉదయ చందు (21), ఒక కూతురు ఉన్నారు. చందు మధ్యాహ్నం కొంతమందితో కలసి ఈతకని శనిగపురం చెరువులోనికి వెళ్ళారు. చెరువుతోనే కలిసి ఉన్న బాయిలోకి ఈత కొట్టడానికి ప్రయత్నించగా ఈత రాని కారణంగా చందు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు.
also read :-జడ్పీ చైర్మన్ ను కలసిన తాడ్వాయి టీఆర్ఎస్ నాయకులు
మృతి చెందిన యువకునికి మాటలు సరిగా రావు. మృతి చెందిన సంఘటన తెలియక చందు కోసం తల్లి వెతకగా బాయి దగ్గర తన కొడుకు బట్టల ఆనవాళ్లు ఉన్నాయని తెలుసుకొని వెళ్లి చూడగా శవమై ఉన్నాడు. మృత దేహాన్ని స్థానికులు బయటకు తీసి ఇంటికి చేర్చారు. మృతునికి ప్రభుత్వం నుండి పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ తోనే కుటుంబ పోషణ జరుగుతుంది. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందాడని తెలిసి తల్లిదండ్రులు, తాత, చెల్లి ఏడుస్తున్న తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.