పైసలిచ్చుడు షూరు అయ్యింది..
ఓటుకు రూ.6 నుంచి రూ.10వేలు
హుజురాబాద్ లో ఓట్ల కాదుకాదు నోట్ల ప్రచారం
(హుజురాబాద్-విజయం న్యూస్)
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రలోభాల పర్వం మొదలైంది. నేటితో బహిరంగ ప్రచారం ముగియనుంది. దీంతో స్థానికేతర నేతలు నియోజకవర్గాన్ని విడిచి వెళ్లాల్సి ఉండగా.. ఉదయం నుంచే నగదు పంపిణీని ప్రారంభించారు. ప్రస్తుతం ఒక్కో ఓటుకు రూ. 6 వేల నుంచి రూ. 10 వరకు కవర్ లో పెట్టి పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ కవర్లపై ప్రత్యేకంగా కోడ్ నెంబర్లు పెట్టుకున్నారు. ఒక్క ఓటరుకు మాత్రమే నగదు ఇవ్వాలనుకుంటే ఆ కవర్పై 1వ నెంబర్ వేస్తున్నారు. ఒక ఇంటిలో నాలుగు ఓట్లు ఉంటే కవర్పై 4 నెంబర్ వేసి పంపిణీ చేస్తున్నారు. ఒక్క ఓటుకు రూ. 6 వేల చొప్పున కొన్నిచోట్ల ఉండగా.. కీలకమైన ప్రాంతాల్లో మాత్రం రూ.10 వేలు పలుకుతోంది. నాలుగు ఓట్లకు రూ. 24 వేల వరకు కవర్లలో పెట్టి కవర్పై నాలుగు అంకె వేసి ఇంటింటికీ పంచుతున్నారు.అన్ని పార్టీలు నగదు పంపిణీ మొదలు పెట్టగా.. అధికార పార్టీ తరఫున ఇచి కవర్లు బహిర్గతమయ్యాయి. ఈ వీడియోలు వైరల్గా మారాయి. స్థానికేతర నేతలు వెళ్లకముందే గ్రామాల్లో ప్రలోభాలు మొదలయ్యాయి. ఇప్పటికే కోట్లకు కోట్ల నగదు హుజురాబాద్ నియోజకవర్గంలో డంప్ చేశారు.
also read- వ్యవసాయ బావిలో మృతదేహం
హుజురాబాద్లో ప్రలోభాలు ఎక్కువవుతున్నాయి. నిన్నటి వరకు ప్రచారానికి వచ్చిన వారికి మాత్రమే ఎంతో కొంత ఇచ్చారు. ఓటర్లకు మద్యం పంపిణీ చేశారు. బుధవారం ఉదయం నుంచి నేరుగా డబ్బు పంపిణీ చేస్తున్నారు. కవర్ లో పెట్టి డబ్బులను ఓటర్లకు పంచుతున్నారు. మరోవైపు ఇక్కడ కేంద్ర బలగాలను దింపినా.. ప్రలోభాల పర్వం యధేచ్చగా కొనసాగుతోంది. ఎన్నికల సంఘం కళ్లు మూసుకుందా అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. అడుగడుగునా నిఘా పెట్టినట్టు ప్రకటించుకుంటున్నా.. నగదు పంపిణీ మాత్రం బహిరంగంగానే సాగుతోంది. ప్రతిపక్ష పార్టీల వాహనాలను పదేపదే తనిఖీలు చేస్తున్నా..కొంతమంది నేతల వాహనాల్లో మాత్రం కోట్ల రూపాయలు డబ్బు రవాణా అవుతూనే ఉంది.
అందుకు సంబంధించిన వీడియో