Telugu News

కిడ్నాప్ అయిన మాజీ సర్పంచ్ హతం.

ఇన్ఫార్మర్ నేపంతో హత్యచేసినట్లు స్పష్టం చేసిన మావోయిస్టులు

0

కిడ్నాప్ అయిన మాజీ సర్పంచ్ హతం.

ఇన్ఫార్మర్ నేపంతో హత్యచేసినట్లు స్పష్టం చేసిన మావోయిస్టులు

లేఖను విడుదల చేసిన మావోస్ట్ నేత శాంత..

విషాదంలో రమేష్ కుటుంబ సభ్యులు

(వెంకటాపురం -విజయం న్యూస్)

ములుగు జిల్లాకు చెందిన మాజీ సర్పంచ్ కోర్సూ రమేష్ ను హతమార్చినట్లు మావోయిస్టులు ఒక లేఖల ప్రకటన చేశారు. వెంకటాపురం మండలం బర్రబొంద గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కొర్సూ రమేష్ గత రెండు రోజుల క్రితం చర్ల మండలం వెళ్తుండగా మావోయిస్టులు కిడ్నాఫ్ చేశారు. ఈ మేరకు సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు రోధనలతో మా భర్తను హాని చేయకుండా విడుదల చేయాలని మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. వదిలే అవకాశం ఉందని అందరు భావించారు. కానీ రమేష్ ను హతమార్చినట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు బహిరంగా లేఖను వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ మవోయిస్టు నేత శాంత పేరుతో విడుదల చేశారు. పోలీసులకు ఇన్ఫార్మర్ గా ఉంటున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లూ తెలిపారు. దీంతో కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి..

also read :-పరమత సహనంతో మెలగాలి : మంత్రి పువ్వాడ..