Telugu News

కళామందిర్ షోరూం ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ..

ఖమ్మం కార్పోరేషన్ కస్బా బజార్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన ప్రముఖ వస్త్ర వ్యాపార రంగ సంస్థ కళామందిర్ షోరూం.

0

కళామందిర్ షోరూం ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ..

(ఖమ్మం – విజయంన్యూస్)

ఖమ్మం కార్పోరేషన్ కస్బా బజార్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన ప్రముఖ వస్త్ర వ్యాపార రంగ సంస్థ కళామందిర్ షోరూం ను ఆదివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  ప్రారంభించారు.

అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఖమ్మం నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ఇప్పటికే అనేక ప్రముఖ వస్త్ర షోరూం లు ఖమ్మంకు రావడం శుభ పరిణామం అన్నారు.

ఎప్పటికప్పుడు మారుతున్న ఫ్యాషన్ కు అనుగుణంగా వివిధ షోరూంలు, మాల్స్ ఖమ్మం జిల్లా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయన్నారు.

గతంలో ఏ శుభకార్యం అయిన హైదరాబాద్, విజయవాడ, చీరాల, చెన్నై వెళ్లాల్సి వచ్చేదని కానీ నేడు ప్రతి ఒక్కటి ఖమ్మం నగరంలోనే ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నారు.

కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, సూడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, కార్పొరేటర్లు , వివిధ రంగాల వ్యాపారులు ఉన్నారు..

 

 

also read :-ఎస్ఐ ని కాల్చిన హెడ్ కానిస్టేబుల్..

also read:-అభివృద్ధికి సహకరించాలి : – ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..