Telugu News

రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్డ్ అవార్డుకు ఎంపికైన విద్యార్థిని నాగ మల్లేశ్వరి

ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న నాగ మల్లేశ్వరి ఉపాధ్యాయురాలు సుధారాణి సహకారంతో రోడ్డు ప్రమాదాలు జరగకుండా సిగ్నల్స్ సహాయంతో డ్రైవర్ను అప్రమత్తం చేయడం అనే కొత్త కాన్సెప్టును తయాచేసి శభాష్ అనిపించుకుంది .రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యేలా చేసింది

0

రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్డ్ అవార్డుకు ఎంపికైన విద్యార్థిని నాగ మల్లేశ్వరి

నాగార్జునసాగర్ – విజయం న్యూస్ :- రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ అవార్డ్స్ కు నాగార్జున సాగర్ హిల్ కాలానికి చెందిన నాగ మల్లేశ్వరి ఎంపికైనట్లు పాఠశాల అధ్యాపకులు శనివారం వెల్లడించారు.హిల్ కాలనీ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న నాగ మల్లేశ్వరి ఉపాధ్యాయురాలు సుధారాణి సహకారంతో రోడ్డు ప్రమాదాలు జరగకుండా సిగ్నల్స్ సహాయంతో డ్రైవర్ను అప్రమత్తం చేయడం అనే కొత్త కాన్సెప్టును తయాచేసి శభాష్ అనిపించుకుంది .రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యేలా చేసింది.

** ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశ్యం….

రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించినా ప్రమదాలు తగ్గలేదు. ఘాట్ రోడ్స్ లో ఎక్కువ యాక్సిడెంట్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. ట్రాఫిక్ సిగ్నల్స్ సహాయంతో ఈ యాక్సిడెంట్ ని నిరోధించడానికి డ్రైవర్స్ ని అప్రమత్తం చేయడమే మే ఈ ప్రాజెక్టు యొక్క ఉద్దేశం. రెండు వాహనాలు ఎదురెదురుగా వచ్చినప్పుడు ఎల్.ఈ.డి లైట్స్ వెలగడం తో పాటు బజర్మోగుతుంది అప్పుడు ఎదురుగా వచ్చే వాహనం డ్రైవరు అప్రమత్తం అవుతాడు.

** నిరుపేద కుటుంబం నుండి వచ్చిన ఆణిముత్యం

బీద కుటుంబం నుంచి వచ్చిన నాగ మల్లేశ్వరి బాలిక హిల్ కాలనీ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నది. తల్లిదండ్రులు వెంకన్న ,మంజుల లు బ్రతుకుదెరువు కొరకు హైదరాబాదుకు వెళ్లగా బాలిక మాత్రం తన నానమ్మ అచ్చమ్మ వద్ద ఉంటూ చదువుకుంటుంది. బాలిక నానమ్మ ఇళ్లలో పని చేస్తూ ఉంటుంది. బాలిక ఆరవ తరగతి నుంచి కూడా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల లోనే చదువుతుంది.

 

 

also read :- రైతు వ్యతిరేక ప్రభుత్వం బీజేపీ.

also read:- నగరంలో పర్యటించిన ఎంపీ నామనాగేశ్వరరావు.