Telugu News

ఏపీలో రెడ్ అలార్ట్ ** ప్రకటించిన వాతావరణ శాఖ అధికారులు

*ఉత్తరాంధ్రను వణికిస్తున్న జవాది తుఫాన్

0

ఏపీలో రెడ్ అలార్ట్

** ప్రకటించిన వాతావరణ శాఖ అధికారులు

*ఉత్తరాంధ్రను వణికిస్తున్న జవాది తుఫాన్

** మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

** మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళోద్దని హెచ్చరిక జారీ చేసిన వాతావరణ శాఖ

** మరో రెండు రోజుల పాటు ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు.. అధికారులు ఉద్యోగులకు సెలవులు రద్దు చేసిన ప్రభుత్వం..

** అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ సి ఎస్ ఆదేశాలు

** ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అదేశం..

** ఏపీలో పెరుగుతున్న చలిపులి

** వణికిపోతున్న జనం..
(అమరావతి-విజయంన్యూస్)

ఏపీలో రెడ్ అలార్ట్ ప్రకటించారు అధికారులు.. జవాద్ తుపాన్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా రెడ్ అలార్ట్ ప్రకటించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రను జవాది తుఫాన్ వణికిస్తోంది. మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెబుతున్న వాతావరణ శాఖ అధికారులు.. బారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండోచ్చని అధికారులు అంచన వేస్తున్నారు. అందుకు గాను మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళోద్దని హెచ్చరిక జారీ చేసిన వాతావరణ శాఖాధికారులు..ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈమేరకు స్పందించిన ఏపీ ప్రభుత్వం మరో రెండు రోజుల పాటు ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటించగా, అధికారులు ఉద్యోగులకు సెలవులు రద్దు చేసింది. అందరు అందుబాటులో.. ఆయా మండల, గ్రామాల్లో స్థానికంగా ఉండాలని ఆదేశించింది.అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ సి ఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే తుపాన్ తోనే భయపడుతున్న ఏపీ ప్రజలను చలిపులి వణికిస్తోంది.. తుపాన్ ప్రభావంతో ఈదురుగాలులు వస్తుండటంతో ఏపీలో చలిపులి పెరుగుతుంది. రోజంతా చలి ఉంటుందని ఏపి ప్రజలు చెబుతున్నారు. దీంతో ప్రజలు వణికిపోతున్నారు.

also read :- తిరుపతి లో పర్యటిస్తున్న సీఎం