హాట్ కేక్ లా అమ్ముడుపోయిన ‘తిరుపతి’ దర్శనం టిక్కెట్లు
నాలుగున్నర గంటల్లోనే 7.08 లక్షల టికెట్లు ఖాళీ
(తిరుమల- విజయంన్యూస్)
శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం నవంబర్, డిసెంబర్ నెలల టికెట్లను టీటీడీ ఆన్లైన్లో శుక్రవారం ఉదయం 9 గంటలకు విడుదల చేసింది. గత నెలలో రోజుకు 8 వేల ఎస్ఈడీ టికెట్లు జారీ చేయగా ప్రస్తుతం రోజుకు 12 వేల చొప్పున రెండు నెలలకు 7 లక్షల 8 వేల టికెట్లను విడుదల చేయగా మధ్యాహ్నం 1:30 గంటలకల్లా భక్తులు వీటిని కొనుగోలు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు భారీగా శ్రీవారి ఎస్ఈడీ టికెట్ల కోసం ఆన్లైన్లో ప్రయత్నించడంతో రికార్డు సమయంలో టికెట్లన్నీ ఖాళీ అయ్యాయి. పరిమిత సంఖ్యలోనే టికెట్లు జారీ చేస్తుండడంతో చాలా మంది భక్తులకు టికెట్లు లభించలేదు.
టీటీడీ ఐటీ విభాగం, టీసీఎల్, జియో సంస్థ క్లౌడ్ మేనేజ్మెంట్ విధానం సాయంతో భక్తులు సులభంగా ఆన్లైన్లో టికెట్లను పొందారు. వెబ్సైట్లోకి ప్రవేశించేందుకు వర్చువల్ క్యూ ద్వారా ముందుగా వెబ్సైట్లో లాగిన్ అయ్యేందుకు సమయాన్ని కేటాయించారు. అనంతరం భక్తులు వర్చువల్ క్యూ పద్ధతి ద్వారా వెబ్సైట్లోకి ప్రవేశించి టికెట్లను బుక్ చేసుకున్నారు. దీంతో సర్వర్ల క్రాష్ సమస్య లేకుండా భక్తులు టికెట్లను పొందగలిగారు.
also read: – తిరుపతిలో విషాద ఘటన
‘ఎప్పటికప్పుడు లెటెస్ట్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? దేశంలో, రాష్ర్టంలో జరిగే తాజా బ్రేకింగ్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? అయితే మా విజయం పేపర్ ను సబ్ స్కైబ్ చేసుకొండి.. మీ స్ర్కీన్ పై ఉన్న గంట గుర్తును నొక్కండి.. ఆ తరువాత ఎలో అని నొక్కండి.. మినిట్ టూ మినిట్ బ్రెకింగ్ న్యూస్ మీ ముంగిట’