Telugu News

టీటీడీ ఓఎస్డీ శేషాద్రి ఇక లేరు.

** గుండెపోటుతో సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన శేషాద్రి

0

టీటీడీ ఓఎస్డీ శేషాద్రి ఇక లేరు.
** గుండెపోటుతో సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన శేషాద్రి

(తిరుమల-విజయం న్యూస్)- 

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) ఓఎస్డీ డాల‌ర్ శేషాద్రి (75) తుది శ్వాస విడిచారు. సోమవారం తెల్లవారుజామున విశాఖలో నిర్వహిస్తున్న కార్తీక దిపోత్సవం కార్యక్రమానికి శేషాద్రి వెళ్లారు. ఈ క్రమంలో ఆయనకు హ‌ఠాత్తుగా గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.

కాగా, గ‌తంలో కూడా ఆయ‌న రెండు, మూడుసార్లు గుండెపోటుకు గుర‌య్యారు. ఆ సమయంలో తిరుప‌తిలో ప్రముఖ వైద్యశాల స్విమ్స్‌కు త‌ర‌లించి చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైద‌రాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరి నెల‌పాటు ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. తాజాగా మ‌రోసారి గుండె పోటు రావడంతో అకాల మరణం చెందారు.

డాలర్ శేషాద్రి.. 1978 నుంచి ఆయ‌న శ్రీ‌వారి సేవ‌లో కొనసాగుతుండగా.. 2007లో రిటైర్ అయ్యారు. కానీ, ఆయను తిరుమల శ్రీ‌వారికి సంబంధించి వివిధ సేవ‌ల‌పై పూర్తి అవగాహన ఉంది. ఈ క్రమంలోనే శేషాద్రిని ప్రభుత్వం ఓఎస్డీగా నియ‌మించింది.

also read :-నేడు ఢిల్లీకి మంత్రులుధాన్యం సేకరణపై స్పష్టత కోసం మరోసారి చర్చలు.