Telugu News

కలెక్టర్ కు జైలు శిక్ష అమలు నిలిపివేత

అసీఫాబాద్ కలెక్టర్ పై కేసు విచారణ

0

ఆసిఫాబాద్ కలెక్టర్ కు జైలు శిక్ష అమలు నిలిపివేత

(హైదరాబాద్-విజయం న్యూస్) :

కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్, ఆర్డీవో రాయ్ సిడం చిత్రు, చింతలమానెపల్లి తహసీల్దార్ బికర్ణదాస్లకు సింగిల్ జడ్జి విధించిన రెండు నెలల జైలు శిక్ష అమలును నిలిపివేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. చింతలమానేపల్లికి చెందిన రౌతు సైదాబాయి. రౌతు రేణుబాయిలకు చెందిన భూమిని భూసేకరణ చట్టం రూల్స్ కు వ్యతిరేకంగా స్వాధీనం చేసుకోవడాన్ని సవాల్ చేసిన కేసులో అధికారులు కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదు. దీంతో సైదాబాయి, రేణుబాయిలు కోర్టుధిక్కార కేసు వేయడంతో వారి ముగ్గురితోపాటు జిల్లా ఎస్పీ, స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు కూడా రెండు నెలల జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధిస్తూ సింగిల్ జడ్జి తీర్పు చెప్పారు. ఈ తీర్పును ముగ్గురూ సవాల్ చేస్తూ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ను శుక్రవారం జస్టిస్ ఎ. రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ టి. వినోదక్కుమార్తో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. జైలు శిక్షను నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చింది.

also read:- హుజారాబాద్ లో గెలిచేదేవరు..? నిలిచేదవరు..?