ఇట్టా అయితే నేనుబోతా..? తాటి
తుమ్మలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన తటి వెంకటేశ్వర్లు
ఇట్టా అయితే నేనుబోతా..?
◆◆ రాజకీయంగా తనను అణగద్రొక్కుతున్నారు
◆◆ కేటీఆర్ కంటే నేనే సీనియర్ను
◆◆ తుమ్మలపై తాటీ వెంకటేశ్వర్లు ఘాటు వ్యాఖ్యలు
అశ్వారావుపేట జూన్ 21 (విజయం న్యూస్)
రాజకీయంగా తనను అణగదొక్కేందుకు టీఆర్ఎస్ పార్టీలో కుట్ర జరుగుతోందని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆరోపించారు. స్దానిక ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో తుమ్మల నాగేశ్వరరావు పై, పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.పార్టీ లో తనను ఉద్దేశ్యపూర్వకంగానే పక్కన పెడుతున్నారని విమర్శించారు. పార్టీలో కేటీఆర్ కంటే నేనే సీనియర్ ని అని వ్యాఖ్యానించారు.తెలుగుదేశంలో ఓడిపోయి టీఆర్ఎస్ లో చేరి మళ్లీ గెలవలేని,దమ్ములేని తుమ్మల తనపై రాజకీయాలు చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.అయినప్పటికీ తాను సమన్వయం పాటించా ననన్నారు.ఇప్పటికైనా పార్టీ అధిష్టానం గుర్తించి నా ఆవేదన పై స్పందించి తనకు సముచిత స్దానం కల్పించాలన్నారు.లేకపోతే తప్పనిసరిగా పార్టీ వీడుతానన్నారు.అధిష్టానం నిర్ణయం మేరకు తన నిర్ణయం స్పష్టం చేసారు. ఈ కార్యక్రమం లొ టి.అర్.ఎస్ సీనియర్ నాయకుడు సుంకవల్లి వీరబద్రరావు,మాజీ జెడ్.పి.టి.సి అంకత మల్లికార్జునరావు ప్రభ్రుతులు పాల్గొన్నారు.