Telugu News

తుపాకీ మిస్ ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి..ఎందుకంటే..?

పోలీస్ సిబ్బందిలో విషాదం

0

తుపాకీ మిస్ ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి..
(ఇల్లందు/గుండాల_విజయం న్యూస్)

భద్రాద్రి ,కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కొమరారం పరిధిలోని కాచన పల్లి పోలీస్ స్టేషన్ లో తుపాకీ మిస్ ఫైర్ కావడంతో హెడ్ కానిస్టేబుల్ సంతోష్ అక్కడికక్కడే మృతి చెందాడు
రాత్రి విధుల సమయంలో ఆయుధాలను పరిశీలిస్తూ శుభ్రం చేస్తున్న సమయంలో ఓ తుపాకీ మిస్ ఫైర్ అయ్యింది. ఈ ఘటనలో వరంగల్ జిల్లాకు చ

గవిచర్లకు చెందిన హెడ్ కానిస్టేబుల్  సంతోష్ అక్కడిక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.  ప్రమాదవశాత్తు ఘటన చోటుచేసుకున్నట్టు తెలుపుతున్న పోలీస్ అధికారులు
ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలకు మృతదేహాన్ని తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారూ. కాగా సమాచారం అందుకున్న భద్రాద్రి కొత్తగూడెం పోలీసు ఉన్నాతాధికారులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని పరిస్థితిని స్థానిక పోలీస్ స్టేషన్  సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు..

ఇది చదవండీ..***నేలకొండపల్లిలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి