Telugu News

ఇల్లెందులో పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

ఏమన్నారంటే..?

0

ఇల్లందులో పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

 

నమ్మించి మోసం చేశారు : పొంగులేటి

== బెదిరింపులతో జనాన్ని ఆపారు..ప్రేమను ఆపగలరా..?

== నన్ను ఎదుర్కోవడానికే ఖమ్మం బహిరంగ సభ

== ఎంపీగా పార్టీలో చేరితే సిట్టింగ్ సీటును వేరే వాళ్లకు ఇచ్చారు

== కండువ కప్పి సీటు కన్ఫామ్ చేశారు

== నన్ను నమ్ముకున్న వారికి ఎదురొడ్డి నిలుస్తా

== కేసులకు భయపడేది లేదు

== మా అనుబంధం వేరు చేయలేరు..ఆయన గెలుపు ఆపలేరు

== బెదిరింపులు వచ్చిన పడకుండా వచ్చిన ప్రజానీకం

(తమ్మిశెట్టి,ఇల్లెందు-విజయం న్యూస్)

నమ్మించారు.. ఏదేదో చెప్పారు.. చివరి నిమిషంలో ఒకర్ని తీసుకొచ్చి టిక్కెట్ ఇచ్చి నిలువున మోసం చేశారు.. అయినప్పటికి సిద్దాంతాలను నమ్మిన వ్యక్తులంగా పార్టీ ఆదేశాలను పాటించాను.. ఈ క్రమంలో నన్ను, నా మనుషులను అవమానించారు.. ఆహేళన చేశారు.. పదవులకు దూరం చేశారు.. అయినప్పటికి అవమానాలను భరించి పార్టీలోనే కొనసాగాం.. నన్ను భయటకు పంపించేందుకు ఎన్ని కుట్రలు పన్నారో నాకు తెలుసు..

ఇది కూాడా చదవండి: ఇల్లెందులో హీటెక్కిన రాజకీయం

నిలువున మోసం చేశారని, ఆ మోసానికి ఫలితాన్ని అనుభవిస్తారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం ఇల్లెందులో జడ్పీచైర్మన్ కోరం కనకయ్య అధ్యక్షతన పొంగులేటి ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమాన్ని నిర్వహించగా, ఇల్లందులో పోటాపోటీగా రెండు సమ్మేళనాలు జరిగాయి రెండిట్లో శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం విజయవంతమైంది. పోటా పోటీగా నిర్వహించడం భారీ సమ్మేళనానికి కోరం కనకయ్య దగ్గర పోటెత్తారు. పదివేల నుంచి పైగానే కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు. అదే విధంగా స్థానిక ప్రజా ప్రతినిధులు కొందరు కట్టడి చేసిన స్వచ్ఛందంగా తరలివచ్చారు.

== నన్ను బలిపశువును చేశారు: మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభనుద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు.

నేను రాజకీయాలకు రావడం కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన అనంతరం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీలో చేరాను. రాష్ట్ర విభజన తర్వాత వైసీపీ నుండి పోటీ చేయగా, ముగ్గురు ఎమ్మెల్యేలు, నేను ఎంపీగా ప్రజలు గెలిపించారు. అభివృద్ధి కోసం, నినాదం కోసం కేసీఆర్ సూచన మేరకు అప్పటి టిఆర్ఎస్లో చేరాం.

ఇది కూడా చదవండి: నేను శీనన్న వెంటే: కోరం కనకయ్య

ఒక పార్టీ నీ విలీనం చేసాం. అయినప్పటికీ మమ్మల్ని దూరం చుట్టంగా చూసారు. అయినప్పటికీ ముఖ్యమంత్రితో ఉన్న సన్నిహితాన్ని కొనసాగిస్తూ వచ్చాను.  అయినా రాజకీయాల్లో నాకు ప్రాధాన్యత ఇవ్వలేదు.

== సిట్టింగ్ ఎంపీ కి ఛాన్స్ ఇవ్వలేదు

వైయస్సార్సీపీలో గెలిచిన నేను సెట్టింగ్ ఎంపీగా ఉన్న తనకు అవకాశం ఇవ్వలేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాపోయారు. నన్ను పార్టీలో చేరమని అనేక వాగ్దానంలో హామీ ఇచ్చారు. ఆయన ఇప్పటివరకు ఏమీ నెరవేరలేదు. తన నమ్ముకున్న వారికి పదవులు లేవు. వేధింపులు కేసులు తోపాటు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అయినప్పటికీ నాలుగున్నర ఏళ్ళు భరించా. టిఆర్ఎస్ పార్టీ గెలుపుకు సహకరించ. అయినా సరే నన్ను విస్మరిస్తున్నారు.

== మేము ఎవరికీ భయపడం

మేము ఎవరికీ భయపడం. కొన్ని నియోజకవర్గాల్లో ఎస్టీ అడ్రస్ కేసుల తో భయపెట్టాలని చూస్తున్నారు. భయపడే వ్యక్తిని కాదు. నేను అవసరమైతే గల్లా పట్టి అడుగుతా..? నన్ను మోసం చేశారు..

ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ కు కోరం గుడ్ బై..?

కానీ నేను నన్ను నమ్ముకున్న వారిని మోసం చేయను. వారిని ఎప్పటికీ కాపాడుకుంటూ ఉంటా, నా కార్యకర్తల జోలికి, అభిమాన జోలికి వస్తే గాంధీయిజంతో కూర్చొని ఆందోళన చేస్తా. ఇది పచ్చి నిజమంటూ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు.

== గిరిజనేతలపై కేసుల అన్యాయం?

గిరిజనేతర్లపై కేసుల అన్యాయమని ఎంపీ పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు.  మేము అంత తక్కువ కాదు. ఎవరిపై ఎన్ని కేసులు పెట్టినా, బెదిరించిన, శీనన్నకు ఫోన్ చేస్తే చొక్కా ఇప్పి గాంధీజీతో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. లేదంటే రాబోయే రోజుల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఎవరికీ భయపడం, కేసులు  భయపడం, అయినా శాంతియుతంగా రాజకీయం చేస్తున్నామని అన్నారు.

== ఈసారి కోరమే మీ ఎమ్మెల్యే                       ఇది కూడా చదవండి: పొంగులేటి కాంగ్రెస్ కు రండీ..:భట్టి

ఈసారి వచ్చే ఎన్నికల్లో కోరం కనకయ్య  గెలవడం ఖాయమని, ఆయన గెలుపును ఎవరు ఆపలేరని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జోస్యం చెప్పారు.  ఆయన గెలవకపోతే, నేను రాజకీయాల్లో ఉండను, ఎందుకంటే ఆయన గెలుపే నా గెలుపు అంతకుమించి ఎక్కువ అని అన్నారు. అంతకంటే ఎక్కువు చెప్పిన ఏమి ఉండదన్నారు.  నీ బాధల్లో, మీ ఆవేదనలో  మేముంటామని, మీకు ఎప్పుడు అండగా ఉంటామని అన్నారు. రెండున్నర అవుతున్న ఇంతమంది ఇక్కడ ఉన్నందుకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

– బిఆర్ఎస్ కు జలక్ ఇచ్చిన ప్రజా ప్రతినిధులు

బిఆర్ఎస్ కు నియోజకవర్గ చాలామంది జలక్ ఇచ్చారు. ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ మున్సిపల్ పాలకవర్గం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినప్పటికీ శీనన్న కోరం బాటలోనే ఎక్కువ మంది పయనించారు. ఈ నేపథ్యంపై ఇల్లందు నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయం అవుతుంది. రాబోయే రోజుల్లో మరింత మంది వచ్చే అవకాశం లేకపోతే ఎందుకంటే వేధింపులు బెదిరింపులు కట్టడి చేయడంతో స్థానిక ప్రజాప్రతినిధులు రాకపోయినా అక్కడున్న కార్యకర్తలను పంపించడం పట్ల బీఆర్ఎస్ నేతలు నాలుక ఖర్చు కుంటున్నారు.