Telugu News

బీఆర్ఎస్ ది విధ్వoసo.. మాది సంక్షేమం: భట్టి

ఆగమైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతున్నాం..

0

బీఆర్ఎస్ ది విధ్వంస.. మాది సంక్షేమం: భట్టి

 

== ఆగమైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతున్నాం..

== స్వల్పకాలంలో నే ఎంతో చేశాం.. ఇంకా చాలా చేస్తాం

= పాల్వంచలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి రఘురాం రెడ్డి ప్రచార సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

(పాల్వంచ-విజయం న్యూస్):

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా చేసి అప్పగించారని, ఆర్థిక వ్యవస్థను ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం గాడిన పెడుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామ రఘురాం రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ..పాల్వంచ లో రాష్ట్ర ఎంపీ గృహనిర్మాణం, శాఖల సమాచార మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, స్థానిక సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి అయ్యప్పస్వామి సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు రోడ్ షో జరిగింది. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ..

ఇది కూడా చదవండి:-; నేనేంటో అభివృద్ధిలో చూపుతా: రఘురాం రెడ్డి

రూ.7 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని ఆర్థికంగా కే సీ ఆర్ దెబ్బ తీశారని అన్నారు. అయినా.. లోటు ను సరిచేస్తూ.. ప్రజల కోసం ఐదు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేస్తున్నామని చెప్పారు. గూడెం నియోజకవర్గంలో ఉన్న పరిశ్రమలు, ప్రాజెక్టులు ఆరోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసినవే అని అన్నారు. రఘురాం రెడ్డి ప్రజలకు అండగా నిలుస్తున్నారని, విజయాన్ని అందించాలని అన్నారు.
== రఘురాం రెడ్డిని భారీ మెజారిటీ తో గెలిపించండి..: పొంగులేటి*
రాష్ట్రంలోని ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డుల సమస్యలకు త్వరలోనే పరిష్కారం చూపిస్తామని రాష్ట్ర వాస్తు, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ప్రజా సేవ కోసం పోటీ చేస్తున్న రఘు రాం రెడ్డిని మెజారిటీతో గెలిపించాలని నిర్ణయించారు. కేసీఆర్ మాయమాటలు, కల్లబొల్లి కబుర్లు ఎవరూ నమ్మొద్దని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, సీపీఐ, సీపీఎం నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.