కాళ్ళేశ్వరం ప్రాజెక్టు ను సీఎల్పీ ఆధ్వర్యంలో పరిశీలిస్తాం: భట్టి
అసెంబ్లీ ప్రాంగణంలోని విలేకర్ల సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
కాళ్ళేశ్వరం ప్రాజెక్టు ను సీఎల్పీ ఆధ్వర్యంలో పరిశీలిస్తాం: భట్టి
★★ ఎవరు అడ్డుపడిన అగేదిలేదు
★★ దశాబ్దాల తెలంగాణ ప్రజల కోరికను కాంగ్రెస్ నేరవేర్చింది.
★★అసెంబ్లీ ప్రాంగణంలోని విలేకర్ల సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
హైదరాబాద్, జులై 30(విజయం న్యూస్)
సీఎల్పీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరు కలిసి
కాళ్ళేశ్వరం ప్రాజెక్టును పరిశీలిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఎవరు అడ్డుపడిన కచ్చితంగా కాళ్ళేశ్వరం వెళ్లితీరుతామని పేర్కొన్నారు. శనివారం అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
ఇది చదవండీ:- గోపాల్ రెడ్డి కోసం ఏఐసీసీ నుంచి దూతలు
ప్రధానంగా నీళ్లు ,నిధులు, నియామకాల ఆకాంక్షలను నేరవేర్చడం కోసమే సోనియా గాంధి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మాత్రం టీఆర్ ఎస్ నేరవేర్చడం లేదు.
టీఆర్ ఎస్ ప్రభుత్వం 8 సంవత్సరాలుగా రాష్ట్ర ఆదాయాన్ని, సంపదను, అప్పుల మొత్తన్నీ కాళేశ్వరం లో దారపోశారు. గోదవరి వరదలకు కాళేశ్వరం మునిగి, రక్షణ గోడలు కూలి నిరుపయోగంగా మారడం వల్ల రాష్ట్ర ప్రజల సంపద నీళ్ల పాలైంది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం. వైఫల్యమే ..
కాళేశ్వరం ద్వార పద్దెనిమిదిన్నర లక్షల అదనపు ఎకరాలకు సాగు నీరు ఇస్తామని నిర్మించిన ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరానికి కూడ సాగు నీరు ఇవ్వలేదు.
గోదావరి వరద నీటితో పంపులు వాల్వ్ లు కూడా నీటిలో మునిగిపోయాయి. మెడిగడ్డ ,అన్నారం,సుందిళ్ళ పంపులు ఇక పనిచేస్తున్నాయా లేదా.. ఎందుకు చెప్పడం లేదు.
ఇది కూడా చదవండీ: రాజగోపాలడు.. రాజీ‘నామమే’నా..?
కాళేశ్వరం ప్రాజెక్టుల వద్దకు వెళ్తే ఎందుకు అడ్డుకుంటున్నారు..? అక్కడ పని చేసే వర్కర్స్ ఫోన్ లు కూడా ఎందుకు తీసుకుపోనివ్వడం లేదు..? అక్కడ దాగి ఉన్న రహస్యాలు ఏంటీ? కాళేశ్వర్ంలో ఏం జరుగుతుంది. ప్రభుత్వం ప్రజలకు చెప్పాలి.
కాళేశ్వరం చూడ కుండ ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పండి? సమగ్ర సమాచారం వెంటనే బయటపెట్టండి.
*సీఎల్పీ బృందంతో కాళేశ్వరం ప్రాజెక్టు విజిట్ చేస్తాను. మా పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి వెళ్తా..*
*అందరిని ఆపినట్టు మమ్మల్ని ఆపితే… టీఆర్ ఎస్ ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది*.
రాష్ట్ర ప్రజలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతుంటే.. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు ఆకలి కేకలతో అలమటిస్తుంటే ప్రజల సమస్యలను గాలికి వదిలేసి సీఎం కేసీఆర్ ప్రభుత్వ అధికారులను వెంటబెట్టుకొని ఢిల్లీకి ఎందుకు పోయారు? అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? పరిపాలన సాగుతుందా?
మంత్రి కేటీఆర్ కాలుకు గాయామై ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నరు. మిగత మంత్రులు మాట్లాడే పరిస్థితి లేదు.. కేసీఆర్ ఢిల్లీలో ఉంటే ప్రజల సమస్యలు ఎవరు పట్టించుకోవాలి?
కాళేశ్వరం, వరద ముంపు ప్రాంతాల్లో జరిగిన నష్టం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడం కోసం వెంటనే ప్రభుత్వం వర్షకాల అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలి.
స్వంత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెట్టొద్దని టీఆర్ ఎస్‌కు హెచ్చరిక
కాంగ్రెస్ శాసన సభ్యులు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో ఉంటారు. ఆయనతో నేను, పార్టీ అదిష్టానం కూడా మాట్లాడింది.. ఆయన కు ఉన్న ఇబ్బంది తెలుసుకొని పరిష్కారం చేస్తామన్నారు.. సాధ్యమైనంత వరకు ఆయన పార్టీలోనే ఉండేలా చూస్తాం..