Telugu News

భట్టిని కలిసిన కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి

నేటి నుంచి అభ్యర్థితో కలిసి ప్రచారం చేయనున్న మంత్రులు

0

భట్టిని కలిసిన కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి

== నేటి నుంచి అభ్యర్థితో కలిసి ప్రచారం చేయనున్న మంత్రులు

(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ను మర్యాద పూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ అభ్యర్థి గా ఎంపికకు సహాకరించినందుకు గాను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని శాలువాతో సత్కరించిన ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి రామసహయం రఘురామి రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సోమవారం ఖమ్మం జిల్లా కేంద్రం లో నీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు క్యాంపు కార్యాలయంకు రాగా  రెవెన్యూ శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి క్యాంప్ కార్యాలయం వెళ్లి ఉపముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ కచ్చితంగా ఖమ్మంలో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని, అందరు కలిసి పనిచేసి అద్భుతమైన విజయం సాధించాలని అన్నారు. రఘురాం రెడ్డికి అభినందనలు తెలిపారు. ఈ రోజు నుంచి ప్రచారంలో పాల్గొంటానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో

ఎమ్మెల్యే లు మట్టా రాగమయి, కునంనేని సాంబశివరావు కాంగ్రెస్ నేతలు మువ్వా విజయ బాబుతో తదితరులు పాల్గొన్నారు

ఇది కూడా చదవండి:- *మైనారిటీలకు అండగా నిలుస్తా: రఘురాం రెడ్డి