ఖమ్మం..అనుమానం తో భార్యపై కత్తితో దాడి...
(ఖమ్మం విజయం న్యూస్ ):-
ఖమ్మం నగరంలోని రేవతి సెంటర్ కు చెందిన తేజవత్ సాయి అనే ఉన్మాది భార్య ప్రీతి పై అనుమానం తో అరటి పండ్లు కోసే కత్తితో విచక్షణ రహితంగా శరీరం పై ఎక్కడపడితే అక్కడ కోయడంతో ప్రీతిని స్థానిక ప్రజలు హుటాహుటిన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఉన్మాది సాయి పరారీలో ఉన్నాడు.
సాయి,ప్రీతి లకు రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. ఉన్మాది సాయి అరటి పండ్లు అమ్మే వ్యాపారం చేస్తుంటాడు.ప్రస్తుతం ప్రీతి ఆరు నెలల గర్భిణీ.