తెగబడిన ఇసుక మాఫియా*
== ఫారెస్ట్ అదికారిణిపై దాడికి యత్నం
== జీప్ ని తగలబెట్టాలని ప్రయత్నం
== డ్రైవర్ రాజేష్ ని బెదరించి సంఘటన వీడియో తీసిన ఫోన్ లాక్కున్న వైనం
అశ్వారావుపేట జూలై 5( విజయం న్యూస్)
అశ్వారావుపేట మండలం బండారుగుంపు ప్రాంతంలో ఇసుక మాఫియా దారులు రెచ్చిపోయి,ఏకంగా ఫారెస్ట్ అధికారిపై దాడికి తెగబడి,జీపును దహనం చేయాలని ప్రయత్నించారు.ఈ తెల్లవారుజామున ఈ వార్త దావానం లా వ్యాపించి,ఉలిక్కి పడేలా చేసింది.ఈ సంఘటన వివరాలలొకి వెళ్లితే అశ్వారావుపేట మండలం బండారుగుంపులొ ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. ఈ విషయం పై పక్కా సమాచారం అందుకొన్న ఫారెస్ట్ అధికారిణి వెంకటలక్ష్మి,తన సిబ్బందితో కలిసి తనిఖీ నిమిత్తం రోడ్ పై కాపు కాసారు.ఈ విషయం పసిగట్టిన ఇసుక మాఫియాదారులు,ఎంతమంది సిబ్బంది వచ్చారని పరిశీలించి,ఇద్దరు మాత్రమే ఉండటం తో ఒక్కసారి మూకుమ్మడిగా కర్రలతో దాడికి ప్రయత్నించారు.వాళ్లను తప్పించుకొంటు జీప్ వద్దకు చేరుకొన్నప్పటకి జీపును పెట్రోల్ తగలబెట్టటానికి ప్రయత్నం చేసారు.ఈ సంఘటనను వీడియో తీసిన ఫారెస్ట్ అధికారి జీపు డ్రైవర్ రాజేష్ ని బెదరించి ఫోన్ లాక్కున్నారు.వాళ్లనుండి తప్పించుకొని వచ్చి స్దానిక పోలీస్ స్టేషన్ లొ పిర్యాదు చేసారు.
ALLSO READ- మా భూములు మాకు ఇవ్వండీ : కొండా రెడ్లు