Telugu News

నేనేంటో అభివృద్ధి లో చూపుతా: రఘురాం రెడ్డి

కాంగ్రెస్ లోక్ సభ ఎంపీ అభ్యర్ధి రామ సహాయం రఘురాం రెడ్డి

0

నేనేంటో అభివృద్ధిలో చూపుతా: రఘురాం రెడ్డి

– కాంగ్రెస్ లోక్ సభ ఎంపీ అభ్యర్ధి రామ సహాయం రఘురాం రెడ్డి
– అన్నపురెడ్డి పల్లి, ములకలపల్లిలలో కార్నర్ మీటిఓగులతో ప్రచారం

(అన్నపురెడ్డిపల్లి/ములకలపల్లి-విజయం న్యూస్)

 

ప్రజాసేవ చేసేందుకే.. లోక్ సభకు పోటీ చేస్తున్నాను అని, తన మార్క్ ఎలా ఉంటుందో అభివృద్ధి చేసి చూపుతానని కాంగ్రెస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామ రఘురాం రెడ్డి అన్నారు. సోమవారం అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి మండల కేంద్రాల్లో కార్నర్ మీటింగ్, రోడ్ షోల ద్వారా ప్రచారం చేశారు. కాంగ్రెస్ శ్రేణులు, వామపక్ష నాయకులు ఎదురెగి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రఘురాం రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ అందుబాటులో ఉంటానని, ప్రజాపాలన అంటే ఏమిటో రుచి చూపిస్తానని అన్నారు. మీ పక్షాన గళం వినిపించేందుకు భారీ మెజారిటీతో గెలిపించి లోక్ సభకు పంపించాలని పేర్కొన్నారు.
*అశ్వారావుపేట ఎమ్మెల్యే ..* జారి ఆదినారాయణ మాట్లాడుతూ.. తనకంటే రెట్టింపు మెజారిటీ రఘురాం రెడ్డికి రావడం ఖాయం అని అన్నారు. అందుకోసం ముమ్మర ప్రచారం జరిగింది. ఈ కార్యక్రమాల్లో విద్య, మౌలిక సదుపాయాల కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, సీనియర్ నాయకులు తాళ్లూరి బ్రహ్మయ్య, మద్దినేని స్వర్ణకుమారి, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు నిర్వహించారు.