Telugu News

ఏన్కూరులో పది పరీక్షల్లో సర్కార్ బడులదే హవ్వా 

మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులు 

0
ఏన్కూరులో పది పరీక్షల్లో సర్కార్ బడులదే హవ్వ
== మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులు
ఏన్కూరు (విజయం న్యూస్):
పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఏనుకూరుతో పాటు వివిధ ఉన్నత పాఠశాలల విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచారు. ఏనుకూరులోని బాలుర గురుకుల విద్యార్థులు, ఏనుకూరు బాలికోన్నత పాఠశాల,జన్నారం,బురదరాఘవాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, మూల పోచారం ఆశ్రమ పాఠశాల, తిమ్మారావుపేట సెయింట్ మేరీస్ పాఠశాలల్లో నూరు శాతం ఫలితాలు సాధించారు. గురుకుల విద్యాలయంలో 74 మంది విద్యార్థులు గాను 74 మంది పాసయ్యారు. ఇక్కడ పి సాయి కృష్ణ 9.8, సిహెచ్ ధరణితేజఅనిల్ 9.8,నితిన్ రెడ్డి 9.8 జి పి ఎ సాధించారు.గుడ్ న్యూస్ పాఠశాలలో 23 మందికి గాను 22 మంది విద్యార్థులు పాసయ్యారు. ఇక్కడ ఆర్ చందు 9.5, పి సాయి సంతోష్ 9.5 జిపిఎ సాధించారు.ఏన్కూరు హైస్కూల్లో 62 మందికి 57 మంది పాసయ్యారు ఇక్కడ కళ్యాణ్ 9.3 అక్షయదీపిక 9.2 సాధించారు.తిమ్మారావుపేట హైస్కూల్లో 50 మందికి గాను 45 మంది ఉత్తీర్ణులయ్యారు. బి అజయ్ 9.2, ఎన్ శ్రీ మౌనిక 9.0 సాధించారు. తిమ్మారావుపేట సెయింట్ మేరీస్ పాఠశాలలో 16 మందికి 16 మంది పాసయ్యారు. సిహెచ్ ప్రణీత 8.8, ఎం భవ్య 8.7 సాధించారు. కస్తూర్బా బాలికల విద్యాలయంలో 39 మందికి గాను 38 మంది పాసయ్యారు. బి అజిత 8.3, వై శ్రీలక్ష్మి 8.0 సాధించారు. జన్నారం హైస్కూల్లో తొమ్మిది మందికి 9 మంది పాసయ్యారు. భాను, సమీరా 8.5, ఏ శరత్ 8.5 జిపిఏ పొందారు. ఏనుకూరు బాలికోన్నత పాఠశాలలో 8 మందికి గాను ఎనిమిది మంది పాసయ్యారు. గౌతమి 8.3, కృష్ణవేణి 8.3 సాధించారు. మూల పోచారం ఆశ్రమ పాఠశాలలో 12 మందికి 12 మంది పాసయ్యారు. నవీన్ 7.8, రామ్ చరణ్ 7.8 సాధించారు. బి ఆర్ పురం హైస్కూల్లో 13 మందికి 13 మంది పాసయ్యారు. నందిని 8.2, కావ్య 8.2 జిపిఎ సాధించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అభినందించారు.