Telugu News

టీఆర్ఎస్ సర్కార్ పై ఇందిరా శోభన్ ఫైర్

నింధితులను తక్షణమే ఉరితీయాలని డిమాండ్

0

▪️ *నిందితులను తక్షణమే ఉరి తీయాలి*
▪️ *ధనలక్ష్మీ కుటుంబానికి సత్వరం న్యాయం చేయాలి*
▪️ *ఫాస్ట్ ట్రాక్ కోర్టుల పేరుతో కాలయాపన చేస్తే చూస్తూ ఊరుకోం..*
▪️ *తెలంగాణలో బెల్ట్ షాపులను వెంటనే రద్దు చేయాలి*
▪️ *మద్యంపై నియంత్రణ విధించకపోతే ఉద్యమిస్తాం..*
▪️ *కేసీఆర్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డ ఇందిరాశోభన్*

(హైదరాబాద్- విజయం న్యూస్)

తెలంగాణలో మహిళలపై నానాటికీ అత్యాచారం, హత్యలు పెరిగిపోతున్నప్పటికీ కేసీఆర్ సర్కారుకు మాత్రం చీమకుట్టినట్లైనా లేకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు మహిళా నాయకురాలు ఇందిరా శోభన్. నల్గొండ జిల్లా ముషంపల్లిలో పట్టపగలు ధనలక్ష్మీపై జరిగిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసిందన్నారు. ధనలక్ష్మీని అత్యంత పాశవికంగా హతమార్చిన నిందితులిద్దరినీ తక్షణమే ఉరితీయాలని ఇందిరాశోభన్ డిమాండ్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి ధనలక్ష్మీ కుటుంబానికి సత్వరం న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందన్నారు. అంతేకాదు.. బాధిత కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకోవాలన్నారు.

ఇటీవల సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన ఘటనకు, నిన్న ముషంపల్లిలో జరిగిన ఘటనకు మూలకారణమైన మద్యాన్ని నియంత్రించాలని ఇందిరాశోభన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాదు.. ఊరూరా విచ్చలవిడిగా వెలిసిన బెల్ట్ షాపులను తక్షణమే రద్దు చేయాలన్నారు. మద్యాన్ని నియంత్రించాల్సిన ప్రభుత్వం.. మద్యం టెండర్లలో రిజర్వేషన్లు కల్పించి తెలంగాణను తాగుబోతుల రాష్ర్టంగా మారుస్తుండటం నిజంగా విడ్డూరంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అటు.. షీ టీమ్స్ ను, సీసీ కెమెరాలను గ్రామ స్థాయిలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ర్టంలో అత్యాచారం, హత్యలు జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేయడం తప్ప.. అనంతరం మహిళల రక్షణను ప్రభుత్వం గాలికి వదిలేస్తుందన్నారు. ధనలక్ష్మీ ఘటనలో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోమన్నారు. మద్య నియంత్రణ, మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే.. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా ఇందిరాశోభన్ హెచ్చరించారు.

also read : 14 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు లొంగుబాటు