ఏసు శాంతి సందేశాన్ని పాటించాలి
★ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
(ఖమ్మం -విజయం న్యూస్):-
మానవాళి క్షేమం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు ఏసుప్రభువు అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్మరించుకున్నారు. ‘గుడ్‌ఫ్రైడే’ ను ప్రజలు శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరిసేలా జరుపుకోవాలని మంత్రి సూచించారు
ఏసుక్రీస్తు బోధనలలోని మానవీయతత్వాన్ని గుర్తు చేసుకున్నారు. ఏసుక్రీస్తు సిలువ వేయబడిన గుడ్‌ఫ్రైడే రోజును స్మరించుకుంటూ క్రిస్టియన్ సోదరులు ప్రార్థనలు చేస్తారని పేర్కొన్నారు. క్రీస్తు మానవాళికి ఇచ్చిన శాంతి సందేశాన్ని గుడ్‌ఫ్రైడే సందర్భంగా అందరూ పునఃశ్చరణ చేసుకోవాలని మంత్రి అజయ్ కోరారు. ఏసు ప్రభువును సిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు, ఆ తర్వాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్ సండే రోజూ మానవాళి చరిత్రను మలుపులు తిప్పిన ఘట్టాలన్నారు.
also read;-రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యటన ఖరారు
‘కరుణామయుడైన క్రీస్తు అనుసరించిన ప్రేమకరుణామయుడైన క్రీస్తు అనుసరించిన ప్రేమ, దయ, శాంతి సహనం, త్యాగం వంటి విలువలు, శత్రువునైనా ప్రేమించమనే ఆదర్శం సమస్త మానవాళి అనుసరించతగినవి’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు