ప్రశాంతంగా కానిస్టేబుల్ రాతపరీక్ష
పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ కమిషనర్*
ప్రశాంతంగా కానిస్టేబుల్ రాతపరీక్ష
*★★ పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ కమిషనర్*
(ఖమ్మం-విజయం న్యూస్)
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం జరిగిన కానిస్టేబుల్ ప్రిలిమనరీ రాత పరీక్షలు చాలా ప్రశాంతంగా జరిగాయి. కానిస్టేబుళ్ళ ప్రిలిమినరీ రాత పరీక్షకు ఖమ్మం జిల్లాలో పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
Allso read:- గణేష్ ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి
ఖమ్మం జిల్లాలో 105 పరీక్షా కేంద్రాలలో 39,551 మంది పరీక్షలకు హాజరుకానుండగా, ఖమ్మం నగరం, పరిసరాల పరిధిలోని 89 పరిక్ష కేంద్రాలలో 31,415 మంది పరీక్షకు హాజరుకానున్నారు. సత్తుపల్లిలోని 16 పరీక్ష కేంద్రాలలో 8,136 మంది పరీక్షకు హాజరుకానున్నారు. అయితే ఖమ్మం కమిషనరేట్ పరిధిలో మొత్తం 105 పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం 6 నుంచి సాయంత్రం 5 వరకు పరిక్ష కేంద్రాల సమీపంలో 500 అడుగుల లోపు ఎలాంటి సభలు, ర్యాలీలకు, సమావేశాలు రద్దు చేశారు.
Allso read:- నేడు భారత్,పాక్ క్రికెట్ మ్యాచ్
★★ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన సీపీ
జిల్లాలో కొనసాగుతున్న కానిస్టేబుల్ ప్రిలిమనరీ రాత పరీక్షల సందర్భంగా పరిక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తు ను పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ పరిశీలించారు.
ఖమ్మం , సత్తుపల్లి ప్రాంతాలలో 105 పరీక్షా కేంద్రాల వద్ద అమలతున్న 144 సెక్షన్ పరిశీలించేందుకు ఈరోజు నగరంలోని శాంతినగర్ కాలేజ్, SBIT కాలేజ్ , బాలికల ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాలను సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి తగిన సూచనలు చేశారు.
ఖమ్మం కమిషనరేట్ పరిధిలో పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అంక్షాలు అమలులో వున్న నేపథ్యంలో పోలీస్ అధికారులు అప్రమత్తం వుండాలని ఆదేశించారు.