*ప్రాపర్టీ చోరీ కేసుల్లోని నిందుతులపై పీడీ యాక్ట్ అమలు: పోలీస్ కమిషనర్*
(ఖమ్మం-విజయం న్యూస్)
వరుస చోరీలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఇద్దరు నిందితులపై పీడీ యాక్ట్ అమలు చేసిన్నట్లు పోలీసు కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు.
నగరంలోని శుక్రవారిపేటకు చెందిన షేక్ అల్తాఫ్ 21yrs, మరియు షేక్ ఇబ్రాహీం 22yrs.
జలసాలకు అలవాటుపడి,
దొంగతనం ద్వారా సులభంగా డబ్బులు సంపాదించవచ్చు అనే ఉద్దేశ్యంతో తాళాలు వేసి ఉన్న ఇళ్ళను, పార్కింగ్ చేసిన వాహనాలను లక్ష్యంగా ఎంచుకొని రెక్కి నిర్వహించి దొంగతనాలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.
ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చింతకాని, కొణిజెర్ల, ఖమ్మం- I టౌన్, ఖమ్మం-III టౌన్ మరియు ఖానాపురం హవేలి పోలీస్ స్టేషన్ల పరిధిలో
(06)వాహన దొంగతనాలు, (02)ఇళ్ళ ప్రాపర్టీ చోరీ కేసుల్లో నిందుతులుగా వున్నారని
తెలిపారు.
ఇలాంటి నేరగాళ్లు బయట తిరుగుతున్నంతకాలం దొంగతనాలు, నేరాలను అదుపు చేయడం కష్టాసాధ్యమని, అందుకే ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ)యాక్ట్ నిందితులపై అమలు చేసినట్లు తెలిపారు.
నేరాలు ప్రవృత్తిగా మార్చుకొని
దొంగతనాలు, వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే నేరగాళ్ళపై నిఘా పెట్టామని, భవిష్యత్తులో ఇలాంటి నేరాలు పునరావృతం అయితే ఉపేక్షించేది లేదని, నిందుతులపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని పోలీస్ కమిషనర్ తెలిపారు.
also read :- నిండిన స్కూల్.. నీళ్ళల్లో విద్యార్దులు
ప్రాపర్టీ దొంగతనాల కేసుల్లో రిమాండ్ అయి ఇటీవల బెయిల్ పై విడుదలైన నిందితులు షేక్ అల్తాఫ్, షేక్ ఇబ్రాహీం తిరిగి నేరాలు చేసే ఆవకాశం వున్నందున నిందుతులపై పీడీ యాక్ట్ అమలు చేసినట్లు తెలిపారు.
వైరా సిఐ వసంత కుమార్ తన సిబ్బందితో కలసినిందుతులను హైదరాబాదు చంచల్ గూడ సెంట్రల్ జైలు తరలించారు. సెంట్రల్ జైలు అధికారులను కలసి పిడీ యాక్ట్ కాపీలను అందజేసి నిందుతులను అప్పగించారు.