Telugu News

బుల్లెట్ పై గల్లిగల్లి తిరుగిన మంత్రి పువ్వాడ

అభివృద్ధి పనులు పరిశీలించి స్వయంగా పార పట్టి మురుగు తొలగించిన మంత్రి

0

ఖమ్మం నగరం సుందరంగా ఉండాలి

★★ పట్టణ ప్రగతిలో ప్రతి పని పూర్తి చేసుకోవాలి..*

★★ మోటార్ సైకిల్ పై ఖమ్మం కార్పోరేషన్ లో విస్తృతంగా పర్యటించిన మంత్రి పువ్వాడ.*

★★ అభివృద్ధి పనులు పరిశీలించి స్వయంగా పార పట్టి మురుగు తొలగింపు..*

★■  నిర్దేశించిన ఏ ఒక్క పని కూడా అగొద్దని ఆదేశం.

 

ఖమ్మం ప్రతినిధి, జూన్ 16(విజయంన్యూస్)

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పట్టణప్రగతి కార్యక్రమం ద్వారా ఖమ్మం నగరం మరింత సుందరంగా తయారుకావాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నగరంలో కొనసాగుతున్న పలు పనులలో గురువారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  పాల్గొన్నారు.మేయర్ పునుకొల్లు నీరజతో కలిసి మోటార్ సైకిల్ పై ఖమ్మం కార్పోరేషన్ పరిధిలో విస్తృతంగా పర్యటించారు.

చెరువు బజార్ లోని పాత కబెలా వద్ద చేపట్టనున్న ప్రధాన కాల్వ మురుగు తొలగింపు పనులను ప్రారంభించారు. ఆనంతరం మయూరి సెంటర్, ముస్తఫా నగర్, స్టేషన్ రోడ్, కస్బా బజార్, కమాన్ బజార్, రావి చెట్టు బజార్, చర్చ్ కంపౌండ్, దంసలాపురం ప్రాంతాల్లో పర్యటించి ఆయా పనులను పరిశీలించి స్వయంగా పాల్గొన్నారు.

Allso read:- పాలేరు నుంచే షర్మిల పోటీ

వైరా రోడ్డులోని బాబురావు పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న కాల్వ పూడిక పనులను ప్రారంభించి స్వయంగా మురుగును తొలగించారు.

పట్టణ ప్రగతిలో చేపట్టాల్సిన ప్రతి పనిని పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ఖమ్మం కార్పోరేషన్ పరిధిలో చేపడుతున్న పారిశుద్ధ్యం, మురుగునీటి కాలువలు, మిషన్ భగీరథ మంచినీటి సరఫరా వంటి పలు అంశాలను పరిశీలించి, నగర ప్రజలతో మంత్రి పువ్వాడ మాట్లాడారు..

ప్రతి డివిజన్ లో క్రీడా ప్రాంగణాన్ని ఎర్పాటు చేయాలని కార్పొరేటర్, అధికారులను కోరారు.

డివిజన్ లలో అవసరం అయిన చోట అంతర్గత రోడ్లు, మురుగునీటి కాలువలు ప్రజల వినతుల మేరకు నిర్మించాలన్నారు.

అనంతరం 16వ డివిజన్ లో రూ.15లక్షలతో ఎర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనం ను మంత్రి పువ్వాడ ప్రారంభించారు.