Telugu News

కూసుమంచిలో నిండు వర్షంలో నిరసన

జోరు వర్షంలో రాస్తారోకో.. ధర్నా

0

కూసుమంచిలో నిండు వర్షంలో నిరసన

** జోరు వర్షంలో రాస్తారోకో..

** ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్ 

(కూసుమంచి-విజయం న్యూస్)

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న, అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, రైతు వ్యతిరేక చట్టాలను, పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా అఖిలపక్ష ఆధ్వర్యంలో దేశవ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బంద్ చేపట్టగా ప్రశాంతంగా కొనసాగుతోంది. అందులో భాగంగానే కూసుమంచి మండల కేంద్రంలో జోరువానలో సైతం బంద్ ను కొనసాగిస్తున్నారు. ఒకవైపు జోరు వాన కురుస్తున్నప్పటికీ అఖిలపక్ష పార్టీల నాయకులు మండల కేంద్రంలో  ధర్నా నిర్వహిస్తున్నారు. బస్సులు, లారీలు.. వాహనాలు నడవకుండా అడ్డుకుంటున్నారు. మండల కేంద్రాలలో దుకాణాలను మూసివేయించారు. ప్రజలు ఈ బంద్ లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు.

పోటో : కూసుమంచి లో జోరు వానలో ధర్నా చేస్తున్న అఖిలపక్షం నాయకులు

వ్యాపారులు, ప్రైవేటు సంస్థల యజమానులు, కాంట్రాక్టర్లు, కార్మికులు, ఉద్యోగులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. దీంతో కూసుమంచి మండలంలో ప్రశాంతంగా బంద్ కొనసాగుతోంది. బస్ డిపో నుంచి ఒక్క బస్సు కూడా బయటికి వెళ్లకుండా అఖిలపక్ష పార్టీల నాయకులు బస్ డిపో వద్ద ధర్నా చేపట్టారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోడ్లన్ని బోసిపోతున్నాయి

also read : -వానోచ్చిన వదులుడే లేదు

కూసుమంచి లో ధర్నాకు సంబంధించిన వీడియో దిగువన