Telugu News

టీఆర్ఎస్ లో డిష్యూ.. డిష్యూం

0

డిష్యూం..డిష్యూం!
👉 పాలేరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో టీఆర్ఎస్ వర్గీయుల మధ్య ఘర్షణ

👉 పరస్పరం దాడులకు దిగిన నేతలు, కార్యకర్తలు..

(కూసుమంచి-విజయం న్యూస్)
కూసుమంచి మండలంలోని పాలేరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం  నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీలు మరియు అనుబంధ సంఘాల కమిటీలను ప్రకటింటించేందుకు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ  సమయంలో కందాళ వర్గీయుల మధ్య గొడవ తలెత్తింది. కాగా ఒకరినోకరు తోపులాడుకోగా చిలికిచిలికి గాలివానగా మారింది. దీంతో టీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే స్వంత ఊరు విషయంలో ఘర్షణ జరిగింది. డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, కల్లూరిగూడెం సోసైటీ చైర్మన్ వాసంశెట్టి వెంకటేశ్వర్లు మధ్య ఘర్షణ జఠిలమైంది. దీంతో ఇద్దరు కొట్టుకున్నారు. కాగా సుమారు గంటపాటు ఉదృత్త వాతావరణం నెలకొంది. నాయకుల కోట్లాటతో నియోజకవర్గ టీఆర్ఎస్ లో గందరగోళం నెలకొంది.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది.

also read:- సాగర్ ఎడమ కాల్వలో రెండు గుర్తు తెలియని మృతదేహాలు లభ్యం

అందుకు సంబంధించిన వీడియోలు