Telugu News

ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ ను గెలిపించుకుందాం: భట్టి

కూసుమంచి రోడ్ షో లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి*

0
ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ ను గెలిపించుకుందాం: భట్టి
*కూసుమంచి రోడ్ షో లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆగస్టు మంత్రి పొంగులేటి*
(కూసుమంచి-విజయం న్యూస్)
 ప్రజా సంక్షేమ పాలన కోసం కేంద్రం లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం అని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క , రాష్ట్ర తాజా గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి భారీ విజయాన్ని కాంక్షిస్తూ మంగళవారం కూసుమంచి లో నిర్వహించిన రోడ్ షోలో ప్రసంగించారు. మత, ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టే బీజేపీని, ఆ పార్టీతో అంటకాగుతున్న బీఆర్ ఎస్ కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని సూచించారు. ఆరు గ్యారంటీలలో ఐదు అమలవుతున్నాయని, ఎవరికీ ఇబ్బంది రానీయమని అన్నారు. ప్రతి పేద రైతుకి రైతుబంధుని వారి ఖాతాలో పడేలా చేసింది కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలని పక్కాగా నెరవేరుస్తున్నామని, కేంద్రం పఅధికారంలోకి వచ్చాక ఆచరణలో చూపుతామన్నారు. పదేళ్లు పాలించిన కేసీఆర్ అంతా నిర్వీర్యం చేసి. ఇప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు.
ఖమ్మం జిల్లా కుసుమంచి మండల కేంద్రం కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్ లో భట్టి విక్రమార్క మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న మధ్యాహ్న భోజనం బిల్లులు వెంటనే క్లియర్ చేసాం. మేము ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాము. ప్రతి పేద రైతుకి రైతుబంధుని వారి ఖాతాలో పడేటట్టు చేసాం లేదా ఇది వారికి కనపడటం ఇచ్చిన హామీలని పక్కాగా నెరవేర్చే పార్టీ ఏదన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని నమ్మి తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యాన్ని అంటగట్టారు. గత పది సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రి వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడాడు. హామీలు నెరవేర్చలేని ఆయన వచ్చి కాంగ్రెస్ పార్టీ వచ్చి పది రోజులు కూడా కాలేదు హామీలు నెరవేర్చలేదని ఎద్దేవా చేయటం సిగ్గుచేటు
మీ వారు ఏ పేదవారినైతే పట్టించుకోలేదు మేము ప్రభుత్వంలోకి వచ్చిన అరగంటకి ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల రూపాయలు అమలు చేసి చూపించాం
మేము అధికారంలోకి వచ్చిన రోజుల్లో 1000 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అమలు లేదా చెప్పాము ఇప్పుడు అది చేసి చూపించాం ఇది కనపడటం
200 లోపు వాడకం ఉన్న పేద వారందరికీ కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి చూపించాం ఇది కనపడటం లేదా
పంట నష్టపోయిన ప్రతి రైతుకి 15వేల రూపాయలు నష్టపరిహారం అందజేస్తాం
ఈ రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి మొదటి తారీకు నాడే జీతాలు ఇచ్చాం
త్వరలోనే ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 3500 పక్కా ఇల్లు ఇస్తామని హామీ ఇస్తున్నాం
పాలేరు నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ప్రతి పేద వారికి లక్ష రూపాయలు ఇస్తానని హామీ ఇస్తున్నాను
*రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి మాట్లాడుతూ..:* ఖమ్మం అంటేనే కాంగ్రెస్ జిల్లా అని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీలకు బుద్ధి చెప్పేలా మన ఫలితం ఉంటుంది.
*కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి మాట్లాడుతూ..:* అందరికీ అందుబాటులో ఉండి పాలన సాగిస్తా అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకురాలు మద్దినేనీ స్వర్ణకుమారి ఉన్నారు.