Telugu News

తహసీల్దార్ ఆఫీస్ లో ఏడ్చిన మహిళ

-- సర్టిఫికెట్ కోసం వారం రోజులుగా తిరుగుతున్న మహిళ

0

తహసీల్దార్ కార్యాలయంలో రోదించిన మహిళ

— సర్టిఫికెట్ కోసం వారం రోజులుగా తిరుగుతున్న మహిళ

— సర్టిఫికెట్ ఇవ్వమని అడిగితే నీ .? అంటూ బూతులు తిట్టిన రెవెన్యూశాఖ ఉద్యోగి..?

— కార్యాలయంలోనే ఏడ్చిన మహిళ

— సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

(ఖమ్మం -విజయంన్యూస్)

నీ అ..? ఏం చేసుకుంటావో చేసుకోపో..? నీకు సర్టిఫికెట్ ఇవ్వను ఏమి ఇవ్వను.. అంటూ రెవెన్యూ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి, సర్టిఫికెట్స్ కోసం వచ్చిన మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్న వీడియో చెబుతుంది… ఎవరికి చెప్పుకోలేక ఆ మహిళ తహసీల్దార్ కార్యాలయంలోనే ఏడ్చుకుంటూ ఉండిపోయిన సంఘటన శనివారం ఖమ్మం  అర్భన్ తహసీల్దార్ కార్యాలయంలో చోటు చేసుకున్నట్లు తెలిసింది. అక్కడికి వచ్చిన స్థానికులు ఆమెతో మాట్లాడి వీడియో తీసి సోషల్ మీడియా గ్రూపులలో పోస్టు చేయగా, ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..   ఖమ్మం నగరంలోని శ్రీనివాసనగర్ కు చెందిన ఓ మహిళ పూల వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తుంది. ఆమె కూతురు ఢిల్లీలో చదువుతుండగా, ఆమెకు జాబ్ కోసం తహసీల్దార్ కార్యాలయంలో సర్టిఫికెట్ కావాల్సి వచ్చింది. అందుకు గాను ఆమె వారం రోజుల కిందట మీసేవలో దరఖాస్తు చేసింది. సర్టిఫికెట్ అర్జెంట్ అని ఆమె వారం రోజులుగా ఖమ్మం తహసీల్దార్ కార్యాలయంకు తిరుగుతుంది. తహసీల్దార్ ను కలవగా ఆమె కిందిస్థాయి ఉద్యోగుల సంతకాలు కావాలని చెప్పింది. దీంతో ఆమె కిందిస్థాయి ఉద్యోగిని కలవగా వారం రోజులుగా  ఇదిగో..అదిగో అంటూ తిప్పుతున్నాడు. ఆమె నాకు చాలా అర్జెంట్ ఉంది సార్ అని చెబుతుండగానే ఆ ఉద్యోగి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆమె తెలిపింది. నీ.. అ..? అంటూ  ఏం చేసుకుంటావో చేసుకోపో..? నీకు సర్టిఫికెట్ ఇవ్వను ఏమి ఇవ్వను.. అంటూ రెవెన్యూ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి, సర్టిఫికెట్స్ కోసం వచ్చిన మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తెలుస్తోంది.  ఆ మహిళ ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధ భరించలేక ఆఫీసులోనే గొళ్ళుమని ఏడ్చింది. ఎందుకు ఏడుస్తున్నావని అక్కడ ఉన్నవారు అడిగితే ఆమె మొదటిగా తడబడింది. ఆ తరువాత గట్టిగ నిలదీయడంతో ఆమె జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆ ఉద్యోగిని పక్కనే ఉన్న ఇతరులు ప్రశ్నించగా ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోండి వీడియో తిసినంత మాత్రాన నేను ఎవరికీ బయపడనూ అని.. ఏ అధికారికి కంప్లైంట్ ఇచ్చిన నన్ను ఎవరు ఏం చెయ్యలేరు అంటూ వెళ్లిపోయినట్లు  ఆ వీడియోలో కనిపిస్తోంది.

also read : ఇటు రావోద్దంటున్న తాటికొమ్మ

— వైరల్ అవుతున్న వీడియో

ఖమ్మం అర్భన్ తహసీల్దార్ కార్యాలయంలో మహిళ ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో పెట్టగా అది వైరల్ అవుతోంది. వందలాధి వాట్సఫ్ గ్రూప్లో షెర్ చేస్తున్నారు. ఆ ఉద్యోగిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.  అయితే అందులో ఎంత వరకు నిజముందనే విషయం తెలియడం లేదు. ఆమె నిజంగా ఆన్ లైన్ చేసిందా..? లేదా..?  ఏం జరిగిందేమో కానీ.. వాట్సఫ్ గ్రూపులలో మాత్రం హాల్ చల్ అవుతంది.  సంబంధిత అధికారులు చొరవ చూపుతారా..? ఆమెకు న్యాయం చేస్తారా..? ఆ ఉద్యోగిపై చర్యలు తీసుకుంటారా..? చూద్దాం..

— అందుకు సంబంధించిన వీడియో దిగువన చూడోచ్చు

also read :చెవిటి,మూగ యువతి పై అత్యాచారం …?