Telugu News

బీజేపీ ఓటమితోనే దేశ ఐక్యత: తమ్మినేని 

దేశ ఉనికికే అది ప్రమాదకరం..అందుకే కాంగ్రెస్‌కు మద్దతు

0
బీజేపీ ఓటమితోనే దేశ ఐక్యత: తమ్మినేని 
== దేశ ఉనికికే అది ప్రమాదకరం..అందుకే కాంగ్రెస్‌కు మద్దతు
== మోడీ పాలనలో రాజ్యాంగ సంస్థలు, స్వతంత్ర వ్యవస్థలు నిర్వీర్యం
== ఇండియా కూటమి లక్ష్యం ఎన్డీఏను గద్దె దించటం
== రఘురాంరెడ్డి గెలుపు బాధ్యత తీసుకుంటాం..
== 16 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు సంపూర్ణ మద్దతు
== సీపీఐ(ఎం) ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సదస్సు రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
== ప్రతిపాదనలకు దోచిపెడుతున్న మోడీ: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క
== బీజేపీ పాలనలో ప్రజల మధ్య విద్వేషాలు: మంత్రి పొంగులేటి
కాంగ్రెస్‌, కమ్యూనిస్టులకు అండగా ఉంటా: అభ్యర్థి రఘురాంరెడ్డి
ఖమ్మం, ఏప్రిల్ 30, 2024 (మంగళవారం):- 
 దేశానికి ఐక్యత విఘాతం కలిగిస్తూ…రాక్షస శక్తిగా ముందుకొస్తున్న బీజేపీని ఎదుర్కొనేందుకే కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు వేదికపైకి వచ్చి ఇండియా కూటమిగా ఏర్పడ్డారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. లోపల రాష్ట్రంలో భువనగిరి పార్లమెంట్‌ స్థానం మినహా మిగిలిన 16 చోట్ల కాంగ్రెస్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌ ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ స్థానిక ఎస్‌ఆర్‌ గార్డెన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన సీపీఐ(ఎం) ఖమ్మం పార్లమెంట్‌ విస్తృత స్థాయి సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టివిక్రమార్క, ఆగస్ట్, గృహ, సమాచారశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు అభ్యర్థి రఘురాంరెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు ముఖ్యనాయకులు.
ఎన్డీఏను గద్దె దించడమే లక్ష్యం: తమ్మినేని వీరభద్రం
పదేళ్ల మోడీ పాలనలో దేశానికి ప్రమాదకరంగా మారిన ఎన్డీఏ ప్రధాన శత్రువుగా ఇండియా కూటమి ఆవిర్భవించింది. దీని ప్రధాన లక్ష్యం ఎన్డీఏను ఈ ఎన్నికల్లో గద్దె దించడమేనని అన్నారు. బీజేపీ విధానపరంగా దేశ ఉనికికే ప్రమాదకరమన్నారు. బీజేపీ వెనుక ప్రజల మధ్య విద్వేషాలను రగిల్ ఓ ఫాసిస్టు సిద్ధాంతం. బీజేపీ హిందూ రాజ్యమంటే ఆ మతంలోని అగ్రకులాల రాజ్యమని వివరించారు. భారత రాజ్యాంగంలో ముఖ్య సారాంశం సమానత్వాన్ని రూపుమాపే సనాతన మనుధర్మాన్ని బీజేపీ ముందుకు తీసుకొస్తోందన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అడ్డుతొలగించుకుంటే మనుధర్మాన్ని స్వేచ్ఛగా అమలు చేయాలనేదే బీజేపీ వ్యూహంగా పేర్కొన్నారు. ప్రతిపక్షాలే కాదు రాజకీయ పార్టీల మార్పు నిర్వీర్యం చేసి ఏకవ్యక్తి రాజ్యాల దేశాన్ని మోడీ ప్రభుత్వం చూస్తోందని. ఆర్థిక దోపిడీని విశృంఖలంగా పూనుకుంది. రాజ్యాంగ సంస్థలు, స్వతంత్ర వ్యవస్థలను నిర్వీర్యం చేసే చర్యలు…చివరకు వాక్ స్వాతంత్య్రాన్ని సైతం హరించేలా బీజేపీ వ్యవహరిస్తోంది. బీజేపీని ఓడిరచడం ద్వారానే దేశ ఐక్యత సాధ్యమన్నారు. రాజకీయాలు వ్యాపారమయం అయ్యాయని, అధికారంలో ఉన్న పార్టీ చుట్టూ తిరిగే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని తెలిపారు. రామహాసహాయం రఘురాంరెడ్డి స్థానికుడు…ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ ఆయన స్వస్థలమని తెలిపారు. ఆయన గెలుపు బాధ్యతను సీపీఐ(ఎం) స్వీకరిస్తుందని, ఆయన అందుబాటులో ఉండి ప్రజాసేవ చేసేలా చూస్తానని తమ్మినేని మాట ఇచ్చారు.
దేశ రక్షణకు ఏకం కావాలి: డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క
దేశ రక్షణకు అందరం ఏకం కావాలని ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టివిక్రమార్క ఏర్పాటు. కాంగ్రెస్‌ అధిష్టానం, రేవంత్‌రెడ్డి మేరకు తాను స్వయంగా సీపీఐ(ఎం) ముఖ్యమంత్రి రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి మద్దతు కోరానన్నారు. దేశ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సంఘటితంగా వెళ్దామని ముందుకు వచ్చిన సీపీఐ(ఎం) నాయకత్వానికి భట్టి కృతజ్ఞతలు తెలిపారు. దేశ సంపద ప్రజలకు చెందేలా చూడటమే కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల లక్ష్యమన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కొద్దిమంది పెట్టుబడిదారుల చేతుల్లో పెడుతున్న బీజేపీని సాగనంపడమే ధ్యేయంగా ముందుకెళ్దామన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని గెలిపించాలని.
సీపీఐ() సహకారం మర్చిపోలేను: హామీ మంత్రి పొంగులేటి
తమ్మినేని సారథ్యంలో సీపీఐ(ఎం) సహకారంతోనే
2014లో నేను ఎంపీనయ్యానని రాష్ట్రానికి, గృహనిర్మాణ, సమాచారశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ భోజనం తాను ఎప్పటికీ మర్చిపోనన్నారు. అలాగే రామసహాయం రఘురాంరెడ్డికి కూడా వెన్నుదన్నుగా నిలవాలని నిర్ణయించుకున్నారు. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాక కామ్రేడ్లు కోరుకున్న దేశంలో పాలనను అందిస్తామన్నారు. అక్షితల పేరుతో మాయ మాటలు చెప్పి బీజేపీ ఓట్లు దండుకోవాలని చూస్తుంది. ఈసారి ఎన్డీఏ కూటమిని ఇంటికి పంపి..నూటికి నూరు శాతం ‘ఇండియా కూటమి’ అధికారంలోకి వస్తుందని పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి సారథ్యంలో పథకాలను సరిగ్గా అమలు చేస్తామన్నారు.
సీపీఐ(ఎం) ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, అన్నవరపు కనకయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, పార్టీ సీనియర్‌ నాయకులు కాసాని ఐలయ్య, ఎం.సుబ్బారావు, ఖమ్మం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్‌, పొన్నం వెంకటేశ్వర్లు, మాచర్ల భారతి, భూక్యా వీరభద్రం, బుగ్గవీటి సరళ, బంతు రాంబాబు, కళ్యాణం వెంకటేశ్వర్లు, వై.విక్రమ్‌, కొత్తగూడెం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏజే రమేశ్‌, మచ్చ వెంకటేశ్వర్లు, కారం పుల్లయ్య, కె.పుల్లయ్య, బ్రహ్మచారి, కాంగ్రెస్‌ నాయకులు బాలసాని లక్ష్మీనారాయణ, రాయల వెంకటేశ్వర్లు, మద్దినేని బేబిస్వర్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.