Telugu News

పార్టీ మారే ప్రసక్తే లేదు

== సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు అబద్దం == బండి సంజయ్ మాటలకు జనాలు నవ్వుకుంటున్నరు == కూసుమంచి మండల పర్యటనలో స్పష్టం చేసిన పొంగులేటి

0

పార్టీ మారే ప్రసక్తే లేదు
== సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు అబద్దం
== బండి సంజయ్ మాటలకు జనాలు నవ్వుకుంటున్నరు
== కూసుమంచి మండల పర్యటనలో స్పష్టం చేసిన పొంగులేటి
(కూసుమంచి-విజయంన్యూస్)
టీఆర్ఎస్ పార్టీని వీడుతున్నానని, బీజేపీలో, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాని సోషల్ మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని, పార్టీ మారే ప్రసక్తే లేదని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని, టీఆర్ఎస్ పార్టీకి విదేయుడనని, సీఎం కేసీఆర్ చెప్పిన పని చేసేందుకు నేను సిద్దంగా ఉన్నానని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీని వీడతానని ఎక్కడ చెప్పలేదని స్పష్టం చేశారు. కచ్చితంగా పోటీ చేస్తానని మాత్రమే చెబుతున్నానని, సీఎం కేసీఆర్ నాకు అవకాశం ఇస్తారని భావిస్తున్నానని అన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు చాలా తప్పుడు కథనాలు అని చెప్పారు. నన్ను ఎవరు కలవలేదని, నేను ఎవర్ని కలవలేదని అన్నారు.

also read :- జిల్లాలో పొంగులేటి ముమ్మర పర్యటన

also read :- హైదరాబాద్‌ నగరానికి భారీ వర్షసూచన

అలాంటి ప్రజలు, అబిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు నమ్మోద్దని అన్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై పొంగులేటి ఘాటుగా స్పందించారు. తెరాస మెడలు వంచి వడ్లు కొనిస్తున్నామని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అనడం హస్యాస్పదంగా ఉందన్నారు. ఆయన మాటలకూ జనాలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సంజయ్ వి అహంకారపూరీతమైన మాటలని అన్నారు. ప్రతి ఏటా ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మట్టా దయానంద్, రామా శ్రీనివాస్, మొక్క శ్రీనివాస్ రావు, శేషగిరి తదితరులు పాల్గొన్నారు.