Telugu News

***నేలకొండపల్లిలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

*చెరుకు ట్రాక్టర్ కిందకు దూసుకపోయిన మోటర్ సైకిలిస్ట్

0

***నేలకొండపల్లిలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
***చెరుకు ట్రాక్టర్ కిందకు దూసుకపోయిన మోటర్ సైకిలిస్ట్
***(నేలకొండపల్లి-విజయంన్యూస్);-
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని రాజేశ్వరపురం గ్రామంలో శుక్రవారం రాత్రి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నేలకొండపల్లి మండలంలోని రాజేశ్వరపురం గ్రామంలోని చెరకు ప్యాక్టరీకి ఎక్కువగా చెరకులోడ్ తో వాహనాలు వస్తుంటాయి.

ఇదే క్రమంలో శుక్రవారం రాత్రి చెరకులోడ్ తో ఓ ట్రాక్టర్ వస్తుండగా, మోటర్ సైకిల్ పై వెనక నుంచి వస్తున్న ఓ వ్యక్తి ట్రాక్టర్ కనిపించకపోవడంతో ట్రాక్టర్ కిందకు దూసుకెళ్లాడు. దీంతో అక్కడిక్కడే చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. చనిపోయిన వ్యక్తి రాజేశ్వరపురం దండ శీను గా స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం తెలుసుకున్ననేలకొండపల్లి ఎస్ఐ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష్ నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలోని శవపరీక్ష్ కేంద్రానికి తరలించారు.

also read :-===ఢిల్లి కోటలు బద్దలు కొడతాం
== కూసుమంచిలో ప్రమాదం.. ఇద్దరికి గాయాలు
కూసుమంచి మండల కేంద్రంలో కారు, ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్రగాయాలైన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. కూసుమంచి మండల కేంద్రంలోని లోక్యతండా క్రాస్ రోడ్డు సమీపంలో ఖమ్మం నుంచి కూసుమంచి వైపు వస్తున్న కారు, ట్రాక్టర్ ఢీకొట్టుకున్నాయి. దీంతో ట్రాక్టర్ లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి, కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తికి తీవ్రగాయాలైయ్యాయి. అడి కారు ముందుభాగం నుజ్జునుజ్జైంది. సంఘటన సమాచారం తెలుసుకున్న కూసుమంచి ఎస్ ఐ నందీఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.