పాలేరు వారంతపు సంత వేలం ఖరారు
== రూ.48.38లక్షలకు హెచ్చు పాటను కైవసం చేసుకున్న నర్సింహులు
== ఏప్రిల్ 1 నుంచి బాధ్యతలు చేపట్టనున్న కొత్తపాటదారులు
(కూసుమంచి-విజయంన్యూస్);-
రాష్ట్రంలోనే అతిపెద్ద వారంతపు సంతలో ఒక్కటైన కూసుమంచి మండలంలోని పాలేరు వారంతపు సంత వేలంపాట బుధవారం ఖరారైంది. గత 20 రోజుల నుంచి వేలం పాటను కొనసాగిస్తుండగా పలు సందర్భాల్లో వేలం పాట సరైన ధర పలకపోవడంతో వేలం పాటను వాయిదా వేశారు. తిరిగి బుధవారం ఎంపీడీవో కరుణాకర్ రెడ్డి, ఎంపీవో రాంచంద్రయ్య ఆధ్వర్యంలో పంచాయతీ సర్పంచ్ యడవల్లి మంగమ్మ అధ్యక్షతన వేలం పాటను నిర్వహించారు. పాలేరు గ్రామంతో పాటు ఖమ్మం,నల్గొండ, సూర్యపేట, మహుబూబాబాద్ జిల్లాలకు చెందిన వ్యాపారులు ఈ పాటలో హాజరైయ్యారు.
also read;-యాదాద్రి మీద ఉన్న శ్రద్ధ రామయ్య మీద లేదా….
అందులో మొత్తం 14మంది పంచాయతీకి ముందస్తుగా డిపాజిట్ చెల్లించారు. కాగా గత వారం రోజుల క్రితం రూ.45లక్షల వద్ద వేలం పాట వాయిదపడగా, అక్కడ నుంచి వేలం పాటు ప్రారంభమైంది.. కాగా రూ.48,30,000లకు నల్గొండ జిల్లా, నార్కెట్ పల్లి గ్రామానికి చెందిన నర్సింహులు వేలం పాటను హెచ్చుపాటగా దక్కించుకున్నారు. ఈ వేలం పాటు ఒక ఏడాది పాటు మాత్రమే కొనసాగనుంది. ఏప్రిల్ 1 నుంచి బాధ్యతలు తీసుకొనున్న ఈ పాటదారుడు వచ్చే ఏడాది 2023,మార్చి 31 వరకు కొనసాగనున్నారు.
అయితే అంతకుముందు జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీడీవో కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ పాలేరు సంత వేలం దక్కించుకున్న ప్రతి ఒక్క వ్యాపారి కచ్చితంగా పంచాయతీ నిబంధనలకు, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. సంతకు వచ్చే క్రయవిక్రయదారులకు, చిరువ్యాపారులకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పంచాయతీ వారు సంతను నిర్వహించే స్థలంలో, సమీప ప్రదేశంలో ప్రతి శుక్రవారం పారిశుధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. సంత వేలం పాటలో ప్రజలందరు సహాకరించాలని కోరారు.
also read :-కేంద్రం కుటీల రాజకీయాలు చేస్తోంది: నామా
== నిబంధనలు పాటించడం లేదు
పాలేరు వారంతపు సంతలో వేలం పాట అనంతరం ప్రభుత్వాధికారులు నిబంధనలు పాటించడం లేదని, కావాలనే వేలంపాటదారులకు కొమ్ముకాస్తున్నారని గ్రామస్థులు ఎంపీడీవో, ఎంపీవోను ప్రశ్నించారు. దాసరి వెంకన్న, ఉప్పలయ్య పలువురు గ్రామస్థులు గతంలో జరిగిన సంత వేలం, ఆ తరువాత జరిగిన పరిణామాల గురించి అధికారులను ప్రశ్నించారు. అయితే ఈ విషయంపై నాకు ఎలాంటి సంబంధం లేదని, నేను కొత్తగా వచ్చాను కాబట్టి కచ్చితంగా నిబంధనలు పాటించే విధంగా తప్పకుండా క్రుసి చేస్తామని హామినిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శీలం నాగమణి, ఉపసర్పంచ్, వేలం పాటదారులు, ప్రజలు హాజరైయ్యారు.