Telugu News

ఆహ్లాదంగా ఖమ్మం హైటెక్ బస్ స్టాండ్

మంత్రి అజయ్ చొరవతో నిర్మించిన ప్రాంగణం

0

ఆహ్లాదంగా ఖమ్మం హైటెక్ బస్ స్టాండ్

★ మంత్రి అజయ్ చొరవతో నిర్మించిన ప్రాంగణం

(ఖమ్మం విజయం న్యూస్):-

ఏడు ఎకరాల విస్తీర్ణంలో రూ.25కోట్ల వ్యయంతో 30 ఖమ్మం నగరంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసి నిర్మించిన బస్ బస్టాండ్‌ ప్రయాణికులకు సకల సౌకర్యాలు అందటంతో పాటు ఆహ్లాదాన్ని పంచుతున్నది.

also read :-రైతుల పండించిన వడ్లు కొనాల్సిందే

శని, ఆదివారం అందులోనూ ఉగాది పండుగ వేళలు కావటంతో నగరంలో చదువుకునే ఇతర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు సొంత ఊర్లకు ప్రయాణ నిమిత్తం బస్ స్టాండ్ కు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన అందమైన వాటర్ ఫౌంటెన్, అధునాతన హంగులతో నిర్మించిన భవనాల వద్ద సెల్ఫీలు దిగుతూ సరదా గడుపుతున్నారు.